ఏం చేయలేకపోయారు.. బాబులో అంతులేని ఆవేదన

చంద్రబాబుకు వాళ్లిద్దరూ లెఫ్ట్ అండ్ రైట్. టీడీపీ ఆర్థిక సామ్రాజ్యానికి వాళ్లిద్దరూ మూల స్థంభాల్లాంటి వారు. అలాంటి వారిని చంద్రబాబు పూవుల్లో పెట్టి మరీ బీజేపీలోకి సాగనంపారు. అప్పుడే అందరికీ డౌటొచ్చింది. కానీ అప్పుడు బీజేపీకి అవసరం వచ్చింది. రాజ్యసభలో బలం లేక కాంగ్రెస్ ధాటికి నిలబడలేక బీజేపీ కూడా చంద్రబాబు పంపిన నలుగురు రాజ్యసభ ఎంపీలను ఆహ్వానించి అక్కున చేర్చింది. Also Read: సోము వీర్రాజు దూకుడు వెనుక ఉన్న అసలైన టార్గెట్ వీరే…! అయితే […]

Written By: NARESH, Updated On : August 7, 2020 9:44 pm
Follow us on


చంద్రబాబుకు వాళ్లిద్దరూ లెఫ్ట్ అండ్ రైట్. టీడీపీ ఆర్థిక సామ్రాజ్యానికి వాళ్లిద్దరూ మూల స్థంభాల్లాంటి వారు. అలాంటి వారిని చంద్రబాబు పూవుల్లో పెట్టి మరీ బీజేపీలోకి సాగనంపారు. అప్పుడే అందరికీ డౌటొచ్చింది. కానీ అప్పుడు బీజేపీకి అవసరం వచ్చింది. రాజ్యసభలో బలం లేక కాంగ్రెస్ ధాటికి నిలబడలేక బీజేపీ కూడా చంద్రబాబు పంపిన నలుగురు రాజ్యసభ ఎంపీలను ఆహ్వానించి అక్కున చేర్చింది.

Also Read: సోము వీర్రాజు దూకుడు వెనుక ఉన్న అసలైన టార్గెట్ వీరే…!

అయితే ఈ నలుగురు ఎంపీలతో మళ్లీ బీజేపీకి దగ్గరకావచ్చని.. బీజేపీతో చెలిమి చేయవచ్చని.. కేంద్రంతో కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని శాసించవచ్చని చంద్రబాబు ఎన్నో కలలుగన్నారు. కానీ ఇప్పుడు కలలన్నీ కల్లలయ్యాయి. బీజేపీ ఆటలో చంద్రబాబు అనుకూల ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ, గరికపాటిలు అరటిపండుగా మారిపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ నుంచి జంప్ అయిన ఈ నలుగురు ఎంపీలను ఇప్పుడు బీజేపీ హైకమాండ్ పూర్తిగా పక్కనపెట్టిన వైనం కనిపిస్తోంది.. సుజనా చౌదరి అమరావతినే ఏపీ రాజధానిగా ఉంచాలని.. మార్చవద్దని పెద్ద ఉద్యమమే చేశాడు. బీజేపీలో ఉండే ఇలా గళమెత్తాడు. హైకమాండ్ అంతా చూస్తోందని సుజనా బెదిరించాడు.

కానీ స్వయంగా కేంద్రంలోని బీజేపీ స్పందించింది. ఏపీ రాజధాని విషయంలో తాము ఇన్ వాల్వ్ అవ్వమని కేంద్రం హైకోర్టులో స్పష్టం చేసింది.. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారమని కుండబద్దలు కొట్టింది. ఈ ప్రకటన తర్వాత సుజనా చౌదరి నుంచి ఒక మాట రాలేదు. సుజనా సైలెంట్ అయ్యాడు.

Also Read: జేసీ రెడ్డప్ప.. ఇంత దూకుడు పనికిరాదప్పా?

చంద్రబాబు అమరావతిపై ఇన్నాళ్లు ఎంతో భరోసాగా ఉన్నాడు.. మన టీడీపీ నుంచి వెళ్లిన ఎంపీలంతా బీజేపీలో ఉన్నారు కదా వాళ్లు ఈ విషయంలో ఏదో పొడిచేస్తారని చాలా భావించాడట.. అమరావతిలో పెట్టుబడులు కూడా భారీగా టీడీపీ నేతలు పెట్టడంతో సుజనా చౌదరి సహా సీఎం రమేశ్ లు ఏదో చేస్తారని చంద్రబాబు భారీ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వీళ్లు ఏం చేయలేరని తేలిపోవడంతో చంద్రబాబు సహా టీడీపీ నేతలు గుండెలు బాదుకుంటున్నారని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.. మొత్తానికి బీజేపీ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు చంద్రబాబుకు దిమ్మదిరిగిపోయిందని.. నలుగురు ఎంపీలు కింగ్ మేకర్లు అనుకుంటే ఆటలో అరటిపండు మాత్రమేనని టీడీపీ నేతలకు తత్త్వం బోధపడింది. చంద్రబాబు పప్పులు ఇప్పుడు ఏపీలోనూ ఉడకవని.. అటు ఢిల్లీలో ఉడకవని ఒక్కదెబ్బతో బీజేపీ చూపించిందని అంటున్నారు. అందుకే నలుగురు ఎంపీలు బీజేపీలో ఉన్నా ఏం చేయలేకపోయారన్న ఆవేదన బాబులో ఉందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.