https://oktelugu.com/

అమెరికన్లను బెంబేలెత్తిస్తున్న ఉల్లి..!

కరోనా కాలంలో ఉల్లిని కూడా భయపడాల్సి రోజులు వస్తున్నాయి. ప్రధానంగా అగ్రరాజ్యంగా బీరాలుపలికే అమెరికా ఇప్పుడు ఉల్లి పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారు. ఇప్పటికే కరోనాతో అష్టకష్టాలు ఎదుర్కొంటున్న అమెరికా.. ఇప్పుడు ఉల్లికి కూడా భయపడాల్సి వస్తుండటం శోచనీయంగా మారింది. ఇంతకీ అమెరికన్లు ఉల్లిని చూసి ఎందుకు భయపడుతున్నారో తెలుసుకుందాం.. Also Read: ‘బండి’ టార్గెట్ గా కొత్త రాజకీయాలు? ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి ఎప్పటి నుంచి మనకు విన్పిస్తూనే ఉంది. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 7, 2020 / 06:12 PM IST
    Follow us on

    కరోనా కాలంలో ఉల్లిని కూడా భయపడాల్సి రోజులు వస్తున్నాయి. ప్రధానంగా అగ్రరాజ్యంగా బీరాలుపలికే అమెరికా ఇప్పుడు ఉల్లి పేరు చెబితేనే ఉలిక్కి పడుతున్నారు. ఇప్పటికే కరోనాతో అష్టకష్టాలు ఎదుర్కొంటున్న అమెరికా.. ఇప్పుడు ఉల్లికి కూడా భయపడాల్సి వస్తుండటం శోచనీయంగా మారింది. ఇంతకీ అమెరికన్లు ఉల్లిని చూసి ఎందుకు భయపడుతున్నారో తెలుసుకుందాం..

    Also Read: ‘బండి’ టార్గెట్ గా కొత్త రాజకీయాలు?

    ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి ఎప్పటి నుంచి మనకు విన్పిస్తూనే ఉంది. ఏ కూరలోనైనా ఉల్లిని వాడటం తప్పనిసరి. ఉల్లితో కూరకు వచ్చే రుచే వారంటారు వంట తెల్సినవారు. అయితే అమెరికన్లు మాత్రం ఉల్లి పేరు చెబితేనే బెంబేలెత్తిపోతున్నారు. అమెరికాలో ఉల్లిపాయల వల్ల సాల్మోనెల్లా అనే వ్యాధి విజృంభిస్తుందట. ఇది కరోనా వైరస్ చూసిన ప్రభావం కంటే ఎక్కువగా ఉంటుందని అక్కడి వైద్యులు చెబుతుండటంతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.

    సాల్మోనెల్లా ప్రధానంగా పొట్టలోని పేగులపై ప్రభావం చూపుతుందని దీనివల్ల డయేరియా.. జ్వరం.. కడుపునొప్పి వంటివి వస్తాయని అమెరికా అంటు వ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. సాల్మోనెల్లా బ్యాక్టీరియా వల్ల చాలామందిలో ఫుడ్‌ పాయిజన్‌ అవుతుందని పేర్కొంది. ఈ వ్యాధి సోకిన వారిలో వెంటనే లక్షణాలు కనిపించవని వైద్యులు చెబుతున్నారు. 8గంట నుంచి 72గంటల తర్వాతే లక్షణాలు బయటపడుతాయని చెబుతున్నారు.

    Also Read: జేసీ రెడ్డప్ప.. ఇంత దూకుడు పనికిరాదప్పా?

    ఈ వ్యాధి సోకిన వారిలో నాలుగు నుంచి వారంపాటు లక్షణాలు ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. డయేరియా.. జ్వరం.. కడుపు నొప్పి.. వికారం.. వాంతులు.. తలనొప్పి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ బ్యాక్టిరియా బారిన ఇప్పటికే 34రాష్ట్రాల్లో అనేకమంది పడ్డారట. అయితే ఈ వ్యాధి బారినపడిన వారు ఎక్కువగా మంచినీరు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నీటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే కరోనాతో సతమతం అవుతున్న అమెరికన్లను ఉల్లి కూడా భయపెట్టిస్తుండటం గమనార్హం.