Chiranjeevi Marriage: తెలుగు సినిమా ఇండస్ట్రీని తారా స్థాయికి తీసుకెళ్లిన హీరోల్లో చిరంజీవి కి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది…ఆయన సాధించిన విజయాలు అతన్ని చాలా గొప్ప రేంజ్ లో కూర్చోబెట్టాయి. ఆయన స్థానం వేరు, ఆయన స్థాయి వేరు అనే రేంజ్ లో చిరంజీవి గురించి మాట్లాడుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి మెగాస్టార్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న నటుడు కూడా తనే కావడం విశేషం…ఇక మెగాస్టార్ చిరంజీవి తన స్వయం కృషి తో ఇండస్ట్రీ కి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ చాలామందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ అనేది ఇండస్ట్రీలో ఒక వృక్షంలో పాతుకు పోయింది అంటే దానికి ముఖ్య కారణం మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. చిరంజీవి కెరియర్ మొదట్లో చాలా వరకు స్ట్రగుల్స్ ని ఎదుర్కొన్నప్పటికీ అవకాశాల చాలా కోసం ఆసక్తిగా ఎదురు చూశాడు. ఏ చిన్న అవకాశం ఉన్నా సరే దాన్ని వాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు అయితే చేసేవాడట. ఒక్కోసారి తినడానికి తిండి లేకుండా ఒకరోజు మొత్తం పస్తులు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయంటూ చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…ఇక ఈరోజు తన బర్త్ 70 వ పుట్టిన రోజు జరుపుకుంటున్న చిరంజీవి ఒకప్పటి విషయాలను గుర్తు చేస్తూ వచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా వైరల్ అవుతొంది. చిరంజీవి తన పెళ్లి రోజున సైతం షూటింగ్లో పాల్గొన్నారు.
Also Read: బిగ్ బాస్ 9 లో కాంటెస్టెంట్ గా రాబోతున్న ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరో…
ఏం ఎస్ రెడ్డి గారు నిర్మించిన ‘తాతయ్య ప్రేమలీలలు’ సినిమా షూటింగ్ లో పాల్గొన్న సందర్భంలో అదేరోజు తన పెళ్లి ఉండడంతో షూటింగ్లో పాల్గొని తొందర తొందరగా పెళ్లి పీటల మీదికి వచ్చి షర్టు మార్చుకునే అంత టైం కూడా లేకపోవడంతో చిరిగిన షర్ట్ మీదనే కూర్చొని తాళి కట్టడానికి రెడీ అయ్యారట.
అది చూసిన కొంత మంది షర్ట్ చిరిగింది వేరే షర్ట్ వేసుకోవచ్చు కదా అని అడిగితే, చిరిగిన చొక్కా వేసుకుంటే తాళి కట్టనివ్వరా పెళ్లి చేసుకోనివ్వరా అంటూ చిరంజీవి ఫన్నీ సమాధానం చెబుతూ అదే షర్ట్ మీద కూర్చొని సురేఖ మెడలో తాళి కట్టినట్టుగా చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.
మరి మొత్తానికైతే చిరంజీవి లాంటి డెడికేషన్ తో ఉన్న నటులు చాలా తక్కువ మంది ఉంటారు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం చిరంజీవి గురించి చాలా గొప్పగా ప్రస్తావించడం మన పలు సందర్భాల్లో చూశాం. అతని స్వయం కృషి, అతనికి సినిమా మీద ఉన్న ప్యాషన్, వర్క్ పట్ల డెడికేషన్ ఇవన్నీ కలిపే అతన్ని మెగాస్టార్ కుర్చీలో కూర్చోబెట్టాయనేది వాస్తవం…