Bigg Boss 9 Telugu Tollywood Star Hero: ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాలతో పాటుగా మరికొన్ని ఎంటర్టైన్మెంట్ ను అందించే రియాల్టీ షో లను సైతం ఆసక్తిగా చూస్తూ వాటిని సక్సెస్ చేస్తున్నారు… ఇక స్టార్ మా లో గత 8 సీజన్స్ గా ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు 9 వ సీజన్ కి రెడీ అయింది… టెలివిజన్ రంగంలోనే అత్యంత బిగ్గెస్ట్ రియాల్టీ షోగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 8 సీజన్లో అంచెలంచెలుగా ఒక్కో సీజన్ కి భారీ గుర్తింపును సంపాదించుకుంటూ ప్రేక్షకుల మన్ననలు పొందుతూ ముందుకు సాగుతున్న ఏకైక రియాల్టీ షో గా బిగ్ బాస్ మంచి గుర్తింపును సంపాదించుకుంది. మరి బిగ్ బాస్ తొమ్మిదో సీజన్ కోసం ఇప్పుడు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఈ షో లోకి కంటెస్టెంట్లుగా ఎవరిని తీసుకోవాలి అనే దాని మీద బిగ్ బాస్ యాజమాన్యం ఇప్పటికే చాలా కసరత్తులు చేసి కొంతమంది సినిమా సెలబ్రిటీలను సైతం కంటెస్టెంట్లుగా తీసుకురావాలని ఉద్దేశ్యంతో ఉన్నారు. ఇక వాళ్ళందరినీ హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో సక్సెస్ అయినట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే ఒకప్పుడు ప్రేమదేశం సినిమాతో మంచి పాపులారిటీని సంపాదించుకున్న హీరో అబ్బాస్…అయితే ఆయన గత కొన్ని రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. న్యూజిల్యాండ్ లో సాఫ్టువేర్ జాబ్ చేస్తూ ఆయన న్యూజిల్యాండ్ లోనే సెటిల్ అయ్యారు.
Also Read: జగన్ తో షర్మిల భేటీ?
కానీ ఇప్పుడు అబ్బాస్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన కూడా బిగ్ బాస్ హౌస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఇప్పటికి ఆయనతో మంతనాలు జరిపిన బిగ్ బాస్ యాజమాన్యం అతన్ని ఒక కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లోకి తీసుకొస్తున్నారు.
మరి ఈ విషయాన్ని తెలుసుకున్న అబ్బాస్ అభిమానులు సైతం ఆయన రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఒకప్పుడు అబ్బాస్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉండేది. మధ్యలో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన మేరకు మెప్పించకపోవడంతో ఆయన మార్కెట్ పూర్తిగా పడిపోయింది. దాంతో ఇండస్ట్రీలో అతనికి అవకాశాలు కరువయ్యాయి.
మరి మరోసారి ఆయన బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అతనికి సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంది… చూడాలి మరి బిగ్ బాస్ హౌస్ లోకి అబ్బాస్ ఎంట్రీ ఇస్తే ఆయన ఎలా ఆడతాడు. తద్వారా బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా నిలుస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…