Chiranjeevi : సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి మెగాస్టార్ చిరంజీవి మాత్రమే గుర్తుకు వస్తాడు. ఒకప్పుడు మూస ధోరణిలో సాగుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కిస్తూ తన డాన్స్ తో ఫైట్స్ తో ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్న ఏకైక నటుడు చిరంజీవి(Chiranjeev). మరి అప్పటినుంచి ఇప్పటివరకు భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో కూడా సూపర్ సక్సెస్ లను సాధించడానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం ఆయన వశిష్ట(Vashishta) డైరెక్షన్ లో విశ్వంభర (Vishvambhara) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కొద్ది రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే పెరుగుతున్నాయి. మరి దానికి తగ్గట్టుగానే చిరంజీవి ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారట. ఇక ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆయన అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఒక సినిమా కమిట్ అయ్యాడు. మరి ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూట్ ని కూడా నిర్వహించే పనిలో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
Also Read : చిరంజీవి చేసిన ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా మారకపోవడానికి కారణం ఏంటంటే..?
మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి లైనప్ చాలా అద్భుతంగా ఉంది. అయితే ఒకప్పుడు చిరంజీవితో పూరి జగన్నాథ్ సినిమా చేయబోతున్నాడు అంటూ చాలా వార్తలైతే వచ్చాయి.
ఆటో జానీ (Auto Johnny) పేరుతో ఈ సినిమా తెరకెక్కబోతుందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా మెటీరియాలైజ్ అవ్వలేదు. చిరంజీవి పూరి జగన్నాథ్ (Puri Jagannadh) డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తే బాగుంటుంది అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
వీళ్ళ కాంబినేషన్లో కనక సినిమా పడితే అది సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుందంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…ఇక పూరి జగన్నాథ్ మాడ్యులేషన్ డైలాగులు వినిపిస్తే అవి ఎలా బ్లాస్ట్ అవుతాయి అనే ధోరణిలో మరి కొంతమంది ఆలోచిస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా ఈ ఏజ్ లో చిరంజీవి వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. మరి పూరి జగన్నాథ్ తో ఈ క్రమంలోనే సినిమా చేసే అవకాశాలు ఉన్నాయా? లేదా అనే ధోరణిలో కొన్ని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పూరి ఉన్నాడు కాబట్టి చిరంజీవి అతనికి ఛాన్సులు వచ్చే అవకాశాలైతే లేవు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం విశేషం.
Also Read : చిరంజీవి కి చుక్కలు చూపించిన నయనతార..ఇలాంటి డిమాండ్స్ ఎవ్వరూ చేసుండరు!