Chiranjeevi and Ram Charan : ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది. ఇక చిరంజీవి లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం భారీ విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉండటం విశేషం…ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు కమర్షియల్ గా సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. ఇప్పటికే 200 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టాడు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి చాలా ప్రత్యేకమైన స్థానం అయితే ఉంది. హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి (chiranjeevi) వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకొని మెగాస్టార్ గా మారాడు. మరి ఏది ఏమైనా కూడా గత 40 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు. మరి ఇలాంటి చిరంజీవి ఏ సినిమా చేసినా కూడా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరిస్తూ వస్తున్నాడు. ఆయన చేసే సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు అనేది మనందరికి తెలిసిందే. ఒక చిన్న తప్పు కూడా ఉండకుండా సినిమా ప్రీ ప్రొడక్షన్ సమయంలోనే దర్శకులతో కూర్చుని డిస్కస్ చేస్తాడు. మరి ఏది ఏమైనప్పటికి చిరంజీవి లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి…
అంటే చిరంజీవి ఈ ఏజ్ లో కూడా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం. ఇక రామ్ చరణ్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళుతున్నప్పటికి ఆయనకి పోటీనిస్తూ చిరంజీవి సైతం ముందుకు సాగుతున్నాడు. అయితే రామ్ చరణ్ చిరంజీవి కాంబినేషన్ లో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా అయితే పట్టాలెక్కలేదు.
ఇంతకీ ఆ సినిమా ఏంటి ఆ మూవీకి దర్శకుడు ఎవరు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్…ఈయన దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక అదే సమయంలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చేశాడు. మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి కనక త్రివిక్రమ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైతే అందులో రామ్ చరణ్ చిరంజీవి ఇద్దరు కలిసి నటించేవారు.
ఇక వీళ్లిద్దరూ కలిసి ఆచార్య సినిమాలో కనిపించినప్పటికి ఆ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. తద్వారా ఈ సినిమాలో నటించి ఉంటే మాత్రం ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి ఉండేదని త్రివిక్రమ్ వీళ్లిద్దరిని బాగా హ్యాండిల్ చేసేవాడు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి…