Chiranjeevi – Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో వస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరి ఈ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన స్టామినా ఏంటో చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని చాలా ఉన్నతమైన స్థానంలో నిలిపాయి… ఇక ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించి ఈ ఏజ్ లో ఆయనకు గొప్ప గుర్తింపు సంపాదించి పెడుతుందనే ఉద్దేశ్యంతో తను ఉన్నట్టుగా తెలుస్తోంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమా అంటే మినిమం గ్యారంటీ సినిమా… కాబట్టి ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సంక్రాంతి వస్తున్నాం’ (Sankranthiki Vastunnaam) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా 200 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. సీనియర్ హీరో అయిన వెంకటేష్ కి ఇప్పటివరకు అలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అయితే రాలేదు. కానీ ఆ సినిమాతో ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి చిరంజీవి మీద కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో క్యామియో రోల్స్ కోసం కొంతమంది హీరోలను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడ నుంచి ఉపేంద్ర, తమిళ్ నుంచి రజినీకాంత్ లతో ఇందులో క్యామియో రోల్స్ ఇప్పించబోతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
ఇక జైలర్ సినిమా లో క్యామియో రోల్స్ ఉండటం వల్లే సినిమా సూపర్ సక్సెస్ ని సాధించిందిం ఇక ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాలో సైతం ఇతర భాషల నుంచి కొంతమంది హీరోలతో క్యామియో ఇప్పించి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అనిల్ రావిపూడి ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధించబోతుంది. తద్వారా ఈ సినిమాతో చిరంజీవి ఇమేజ్ తారాస్థాయికి వెళ్ళిపోతుందా? అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు తనను తాను మరోసారి స్టార్ డైరెక్టర్ ఎలివేట్ చేసుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
మరి ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి మెగాస్టార్ చిరంజీవిని టచ్ చేసి హీరో అయితే లేడు అనేది వాస్తవం… కాబట్టి ఇప్పుడు మరోసారి చిరంజీవి తన స్టామినాను చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది…