Homeఎంటర్టైన్మెంట్Bunny Vas Sensational Tweet : పెద్ద హీరోలందరూ ఈ విషయం గుర్తుంచుకోండి... బన్నీ వాస్...

Bunny Vas Sensational Tweet : పెద్ద హీరోలందరూ ఈ విషయం గుర్తుంచుకోండి… బన్నీ వాస్ సంచలన ట్వీట్

Bunny Vas Sensational Tweet : ఇటీవల టాలీవుడ్ లో కొత్త వివాదం నెలకొంది. ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్ కి పర్సెంటేజ్ విషయంలో విబేధాలు తలెత్తాయి. ఎగ్జిబిటర్స్ థియేటర్స్ బంద్ కి పిలుపినిచ్చే వరకు వ్యవహారం వెళ్ళింది. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. థియేటర్స్ బంద్ నిర్ణయం వెనుక నలుగురు బడా నిర్మాతలు ఉన్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఆ నలుగురిలో ఇద్దరిగా ప్రచారం అవుతున్న నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు మీడియా ముందుకు వచ్చారు. వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

థియేటర్స్ విషయంలో గుప్తధిపత్యం సాగిస్తున్న ఆ నలుగురిలో తాము లేమని వారు అన్నారు. అలాగే థియేటర్స్ బంద్ ఆలోచనకు గోదావరి జిల్లాల్లో బీజం పడింది. దీని వెనుక జనసేన నేత ఉన్నాడని దిల్ రాజు ఆరోపించారు. ఈ క్రమంలో జనసేన పార్టీ ఒకరిపై వేటు వేసింది. ఈ వ్యవహారం పై నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. రాజకీయ క్రీడలో సినిమా పరిశ్రమ కుదేలు అవుతుందని అసహనం వ్యక్తం చేశారు. ఈసారి ఆయన నేరుగా పెద్ద హీరోలకు కీలక సూచనలు చేశాడు. మీరు రెండు మూడేళ్లకు ఒక సినిమా చేస్తే రానున్న నాలుగేళ్లలో 90% సింగిల్ స్క్రీన్ థియేటర్స్ మూతపడతాయి అన్నారు.

అదే జరిగితే మల్టీఫ్లెక్స్ ద్వారా జరిగేది కేవలం 43% బిజినెస్ మాత్రమే అన్నారు. నిర్మాత తీవ్రంగా నష్టపోతాడు అనే అర్థంలో కామెంట్ చేశారు. జరుగుతున్న అర్థ రూపాయి బిజినెస్ లో నీది పావలా నాది పావలా అని కొట్టుకోవడం కాదు. గతంలో మాదిరి దీన్ని రూపాయి బిజినెస్ కి ఎలా తీసుకెళ్లాలో ఎగ్జిబిటర్స్, నిర్మాతలు ఆలోచించాలి. అంతే కానీ పర్సెంటేజ్ సిస్టం గురించి కొట్టుకోవడం కాదు అన్నారు. బన్నీ వాసు ట్వీట్ చిత్ర పరిశ్రమలో చర్చకు దారి తీసింది.

తాజాగా బండ్ల గణేష్ సైతం ఇదే తరహా సూచన చేశాడు. ఎస్వీ కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బండ్ల గణేష్.. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలు చేయాలని సూచించారు. మీ వలె ఏడాదికి రెండు మూడు సినిమాలు తీయాలి. అప్పుడే థియేటర్స్ మనుగడ సాధ్యం అవుతుంది. ఒక థియేటర్ ఓనర్ గా రూ.40 లక్షలు నష్టపోయాను. నాలుగేళ్లకు ఒక సినిమా తీయడం ఏమిటండి అంటూ.. బండ్ల గణేష్ ఈ తరం దర్శకులను, హీరోలను ఉద్దేశిస్తూ మండిపడ్డారు.

Exit mobile version