Salute to the Mother: ఎన్నికల హామీలపై కూటమి ప్రభుత్వం( Alliance government ) ఫోకస్ పెట్టింది. సూపర్ సిక్స్ పథకాలను పట్టాలెక్కించాలని భావిస్తోంది. అందులో భాగంగా తల్లికి వందనం పథకాన్ని త్వరలో ప్రారంభించనుంది. మరో కీలక పథకం అన్నదాత సుఖీభవ సైతం ఇదే నెలలో ముహూర్తం ఖరారు చేసింది. పాఠశాలలో ప్రారంభానికి ముందే తల్లికి వందనం అమలు చేయాలని డిసైడ్ అయింది. ఎందుకు సంబంధించి సన్నాహాలు కూడా ప్రారంభించింది. అయితే ఈ పథకం గురించి కొన్ని మార్గదర్శకాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది? అర్హతలు ఏంటి? అనే వాటిపై రకరకాల ప్రచారం నడుస్తోంది..
* ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి..
అధికారంలోకి వస్తే పిల్లల చదువుకు 15000 చొప్పున సాయం చేస్తామని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హత ఏంటి? ఏ ఏ డాక్యుమెంట్లు కావాలి వంటి వివరాలతో మార్గదర్శకాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తల్లికి వందనం మార్గదర్శకాలు పేరుతో వైరల్ చేస్తున్నారు. ఈ పథకాన్ని జూన్ 12న ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. అయితే చాలా రకాల మార్గదర్శకాలు తో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది.
Read Also: ఏపీ ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కీలక డిమాండ్లు ఇవే..
* పథకానికి అర్హులు వీరే..
1. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వారు ఏపీకి చెందిన వారై ఉండాలి.
2. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివిన వారికి మాత్రమే సాయం అందుతుంది
3. విద్యార్థులకు కనీసం 75% హాజరు ఉండాలి.
4. తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి
5. కుటుంబ వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి.
* అవసరమైన డాక్యుమెంట్లు
1. విద్యార్థి స్టడీ సర్టిఫికెట్
2. తల్లి ఆధార్ కార్డ్
3. తల్లి బ్యాంక్ అకౌంట్ వివరాలు
4. పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికెట్
5. నివాస పత్రం లేదా రేషన్ కార్డ్
6. కుల ధ్రువీకరణ పత్రం
7. అవసరమైతే ఆదాయపు పన్ను పత్రం.. ఇలా వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఉంది ప్రభుత్వం
Read Also: వారు ఔట్.. ఐపీఎల్ లో కోచ్ ల నుంచి ప్లేయర్ల దాకా ఏరివేత మొదలుపెట్టిన జట్లు..
* ఆ రెండు పనులు చేసుకోవాలి..
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సచివాలయాల్లో తల్లికి వందనం లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించనున్నారు. మరోవైపు తల్లికి వందనం పథకం వర్తించాలంటే కీలకమైన రెండు పనులు చేయాల్సి ఉంటుంది. విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్ తో పాటు ఎన్పీసీఐ లింక్ చేసుకోవాలి. ఒకవేళ లింక్ కాని వారు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ లేదా సచివాలయాల్లో సంప్రదించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం ఎప్పటి వరకు మార్గదర్శకాల జారీపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కామన్ గా ఉండే మార్గదర్శకాలేనని తెలుస్తోంది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.