Chiranjeevi Comments On Taapsee: చిరంజీవి ఎంత వద్దనుకున్నా కూడా.. ఏదో ఒక సందర్భంలో రాజకీయాల ప్రస్తావన వస్తూనే ఉంది. ఆయన ఎవరిని కలిసినా సరే.. దాని వెనకాల ఏదో ఉందనే వార్తలు షికారు చేస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఆయన రాజకీయ భవిష్యత్‌పై చాలా క్లారిటీ ఇచ్చారు. తాను ఇకపై రాజకీయాల్లోకి రాబోనని, దూరంగా ఉంటున్నాని ప్రకటించారు.
అయినా కూడా.. ఆయనను మీడియా, అటు రాజకీయ నేతలు వదలట్లేదు. ప్రతి సందర్భంలోనే ఆయనకు రాజకీయ కోణం ఎదరవుతోంది. ఇక తాజాగా మరోసారి ఆయన తన రాజకీయ భవిష్యత్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్లు చేశారు. అయితే ఆయన చేసిన కామెంట్లు చాలా సిల్లీగా అనిపిస్తున్నాయి. వాస్తవానికి రాజకీయాలు అనేటివి చాలా బాధ్యతతో కూడుకున్నవి. ప్రజల తరఫున పోరాడే ఒక వేదిక అని చెప్పుకోవాలి.
Also Read: Ghani Movie Non Theatrical Deal: ‘గని’కి 25 కోట్ల డీల్.. ఏమిటి నిజమేనా ?
అలాంటి వేదిక గురించి మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. కానీ ప్రస్తుతం చిరు చేసిన కామెంట్లు ఎందుకో హేళనగా అనిపిస్తున్నాయి. నిన్న జరిగిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా ప్రీ రిలిజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాప్సీ లాంటి క్యూట్ హీరోయిన్లతో నటించకలేకపోయినందుకు తాను ఫీల్ అవుతున్నట్టు తెలిపారు.
అలాంటి హీరోయిన్లను చూసినప్పుడు తాను అసలు రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా అని అనిపిస్తుందంటూ చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల తాప్సీ లాంటి హీరోయిన్లతో నటించే ఛాన్స్ కోల్పోయానని చిరు మాట్లాడారు. ఈ కామెంట్లే ఇప్పుడు రచ్చ చేస్తున్నాయి. అంటే ప్రజల కోసం పోరాడే ఒక వేదిక అయిన రాజకీయాల కంటే కూడా చిరుకు హీరోయిన్లతో నటించడమే ఎక్కువనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకప్పుడు రాజకీయ పార్టీకి అధినేతగా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చిరంజీవి ఇలాంటి కామెంట్లు చేయడం అంటే.. రాజకీయాలను చిన్న చూపు చూసినట్టే అంటున్నారు రాజకీయ విమర్శకులు. ఒక బాధ్యతాయుతమైన స్థాయిలో ఉన్న చిరంజీవి ఇలాంటి కామెంట్లు చేయడం ఏంటంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Mahesh- Rajamouli Movie: మహేష్ – రాజమౌళి సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా ?