KKR vs RCB 2022: ఐపీఎల్ లో అసలైన సమరం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. ముఖ్యంగా ఐపీఎల్ లో రివేంజ్ ఆట చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. నిన్న జరిగిన కోల్ కతా, బెంగుళూరు మ్యాచ్‌లో ఇదే కనిపించింది. మొదటి మ్యాచ్‌తో బోణీ కొట్టిన కోల్‌కతా.. రెండో మ్యాచ్‌లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయిపోయి.. బెంగుళూరు చేతిలో చిత్తయిపోయింది. బెంగుళూరు ఆల్ రౌండ్ ప్రదర్శనతో విరుచుకుపడటంతో.. కోల్ కతా చేతులెత్తేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా.. టాప్ ఆర్డర్ విఫలం కావడంతో దారుణంగా నష్టపోయింది. ఒక్కరు కూడా 30 పరుగుల చేయలేదు. మంచి ఫామ్ లో ఉన్న వెంకటేష్ అయ్యర్ (10) ను ఆకాష్ దీప్ పెవిలియన్‌కు పంపించాడు. ఇక మరో ఓపెనర్ రహానేను (10)ను మహ్మద్ సిరాజ్ దెబ్బ కొట్టడంతో.. 32 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
Also Read: Chiranjeevi Comments On Taapsee: రాజకీయాల కంటే హీరోయిన్లు ఎక్కువయ్యారా చిరు.. ఏంటీ కామెంట్లు..?
కుప్పకూలిన మిడిల్ ఆర్డర్..
ఆ తర్వాత వచ్చిన మిడిలార్డర్ కూడా అట్లర్ ఫ్లాప్ అయింది. శ్రేయస్ అయ్యర్ (13) మరోసారి నిరాశ పరిచాడు. ఇక మరో ప్లేయర్ నితీష్ రానా (10), సునీల్ నరైన్ (12) పరుగులు మాత్రమే చేశారు. వీరి తర్వాత వచ్చిన బిల్లింగ్స్ (14), జాక్సన్ (0) కూడా ఏ మాత్రం ఆదుకోలేదు. అయితే చివరిలో ఆండ్రూ రసెల్ మాత్రం కొంత ఆకట్టుకున్నాడు. 25 పరుగులు చేసి ప్రమాదకరంగా కనిపిస్తున్న రసెల్‌ను హర్షల్ పటేల్ దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన వారు వచ్చినట్టే ఔట్ కావడంతో.. 18.5 ఓవర్లలో 128 పరుగులకు అందరూ ఐట్ అయిపోయారు.
జోడీలను విడగొట్టని కోలకతా బౌలర్లు..

వాస్తవానికి బెంగుళూరు టాప్ ఆర్డర్‌ను చాలా త్వరగా ఔట్ చేశారు కోల్‌కతా బౌలర్లు. ఉమేష్ యాదవ్, టీమ్ సౌథీ కలిసి అనుజ్ రావత్ (0), విరాట్ కోహ్లీ (12)తో పాటుగా డుప్లిసెస్ (5)ను వెంట వెంటనే ఔట్ చేశారు. దీంతో 17 పరుగులకే 3 మెయిన్ వికెట్లను కోల్పోయింది బెంగుళూరు. కానీ ఇక్కడే బెంగుళూరు మిడిల్ ఆర్డర్ ఆదుకుంది. డేవిడ్ విల్లీ (18)తో పాటుగా రూథర్ ఫడ్ (28), షాబాజ్ అహ్మద్ (27) లు బాగానే రాణించారు. ముఖ్యంగా విల్లీ, రూథర్ ఫడ్ కలిసి 45 పరుగుల చేశారు. వీరిద్దరినీ విడదీసి ఉంటే.. బెంగుళూరులో నిరాశ నెలకొనేది. ఆ తర్వాత రూథర్ ఫడ్, షాబాజ్ అహ్మద్ కూడా 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇక చివరగా.. దినేష్ కార్తీక్ (14) ను 18.2వ ఓవర్లో ఔట్ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నారు. రనౌట్ చేసే మంచి అవకాశాన్ని వదులుకోవడంతో.. చివరి ఓవర్లో 7 పరుగులు చేయాల్సి ఉండటంతో.. కార్తీక్ విజయవంతంగా ఆటాడాడు. రసెల్ బౌలింగ్‌లో మొదటి రెండు బాల్ లను సిక్సు, ఫోర్ గా మలిచి మంచి విజయాన్ని అందించాడు. ఒకవేళ రనౌట్ చేసి ఉంటే.. ఆర్సీబీ గెలుపు కష్టం అయ్యేది.
రస్సెల్ పై రివేంజ్ తీర్చుకున్న షెబాజ్ అహ్మద్..
బెంగుళూరు బౌలర్ అయిన షెబాజ్ అహ్మద్ బౌలింగ్ లో రస్సెల్ రెండు సిక్సులు కొట్టి సత్తా చాటాడు. అయితే అతని మీదనే షెబాజ్ తన బ్యాటింగ్ తో రివేంజ్ తీర్చుకున్నాడు. రస్సెల్ బౌలింగ్ లోనే షెబాజ్ కూడా రెండు సిక్స్ లు బాది 20 బంతుల్లో 3 సిక్స్‌లతో 27 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరించాడు. ఇది చూసిన వారంతా కూడా.. రివేంజ్ ఆట అంటే ఇలాగే ఉండాలంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Prashant Kishor- Chandrababu Naidu: పీకే వ్యూహాల మీదే బాబు భవితవ్యం ఆధారపడిందా?