Ugadi 2022 Special Story: తెలుగు ప్రజల మొదటి పండుగ ఉగాది. దీనికో విశిష్టత ఉంది. అన్ని పండుగలు ఒకలా ఉంటే దీనికి మరో ప్రత్యేకత కలిగి ఉంది. ఈ కాలంలో దొరికే అన్న కాయలతో పచ్చడి చేసుకోవడం దీని ఆనవాయితీ. మామిడికాయ, చింతపండు, వేపపువ్వు, బెల్లం, అల్లం, పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్ని కలిపి షడ్రుచులుగా మిశ్రమం చేసి దాన్ని అందరికి పంచడం తెలిసిందే. దీంతో ఈ పండుగతో జీవితంలో అన్ని రుచుల మేళవింపుతో ఆనందంగా సాగాలని కోరుకుంటారు. పూర్వం నుంచే యుగాదిగా పిలవబడే ఈ పండుగతో తెలుగువారి లోగిళ్లు పరవశించిపోతాయి. పండుగతో అందరిలో సంతోషాలు వెల్లివిరుస్తాయి.
Ugadi pachadi in Telugu

మరో ముఖ్య ఘట్టం పంచాంగ శ్రవణం. ప్రత్యేకంగా ఈ రోజు జాతకాలు చూపించుకుంటారు. ఎవరి పేరు మీద ఎలా ఉందో అని పండితులను అడిగి రాశిఫలాలు తెలుసుకుంటుంటారు. అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతోందనే విషయం పండితులు పంచాంగం చూసి చెబుతారు. ఉగాది పచ్చడిని ఆరగించి పంచాంగ శ్రవణం చేసి పనులు కూడా మొదలుపెడతారు. వ్యవసాయ దారులైతే పొలం వెళ్లి సాగుపని ప్రారంభిస్తారు.
Ugadi pachadi ingredients In Telugu
Also Read: Prashant Kishor- Chandrababu Naidu: పీకే వ్యూహాల మీదే బాబు భవితవ్యం ఆధారపడిందా?
ఉగాది పచ్చడికి ప్రత్యేకత ఉంటుంది. జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు, సుఖాల మేళవింపుకు తార్కాణంగా వీటిని చెబుతారు. పచ్చడికి మామిడి వగరు, బెల్లం తీపి, చింత పులపు, వేప చేదు, ఉప్పును కలిపి పచ్చడి తయారు చేస్తారు. దీన్ని ఇంటిల్లిపాది తాగుతారు. ఇంకా చుట్టుపక్కల వారికి కూడా ఉగాది పచ్చడి రుచి చూపిస్తుంటారు. దీంతో జీవితంలో అన్నింటిని సమంగా చూసుకుని ఎదగాలనే ఉద్దేశమే.
ఉగాది పచ్చడిలో ప్రధానంగా మామిడికాయ భాగమే ఎక్కువ. దీంతోనే రుచికి విలువ తెలుస్తుంది. మామిడిలో ఉండే వగరు జీవితంలో సవాళ్లు ఎలా ఎదుర్కోవాలో సూచిస్తుంది. ఇక బెల్లం సంతోషానికి ప్రతీక. జీవితంలో సంతోషాలు కలగాలని చెబుతోంది. వేపపువ్వు కష్టాలను తెలుపుతోంది. మనకు ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో వివరిస్తుంది. మిరపకాయలు మనలోని కోపానికి ప్రతీకగా నిలుస్తాయి. మనకు కోపం వచ్చినప్పుడు ఎలా మసలుకోవాలని చెబుతాయి. ఇవన్నీ మనకు జీవితంలో ఎలా ఉండాలో సూచిస్తాయనడంలో సందేహం లేదు.

ఇంతటి విశిష్టత కలిగిన పండుగ కావడంతోనే తెలుగువారు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఊరు, వాడా సందడిలా కనిపిస్తోంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడి స్వీకరించి పంచాంగం శ్రవణం చేసి పనులు మొదలు పెడతారు. దీంతో ఏడాదంతా శుభాలు కలగాలని ఆకాంక్షిస్తారు. ఇష్ట దైవాలను పూజించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఉగాదిని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు.
Also Read: Minister Kodali Nani- Chandrababu: చంద్రబాబుపై పోరాటానికే నానిని ఉపయోగించుకోనున్నారా?