Chiranjeevi and Anil Ravipudi : ‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vastunnam) వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. స్క్రిప్ట్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ నెల నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) సంపూర్ణమైన కామెడీ టైమింగ్ తో సినిమా చేసి చాలా ఏళ్ళు అయ్యింది. రీ ఎంట్రీ తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం లో కామెడీ చేసాడు కానీ, అది మెగాస్టార్ రేంజ్ ఏమాత్రం కాదు. శంకర్ దాదా MBBS ,అందరివాడు తరహాలో సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు కామెడీ ఉండే సినిమాలు మెగాస్టార్ చేయడం లేదు. మళ్ళీ వింటేజ్ మెగాస్టార్ కామెడీ టైమింగ్ ని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi). స్క్రిప్ట్ వినిపిస్తున్నప్పుడే చిరంజీవి పగలబడి నవ్వుకున్నాడట. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని ఆయన ఎదురు చూస్తున్నాడు.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
ఇకపోతే ఈ సినిమా సెకండ్ హాఫ్ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయన మీద ఒక పాట, ఒక ఫైట్ సన్నివేశం కూడా ఉంటుందట. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో విలన్ రోల్ కోసం యంగ్ హీరో కార్తికేయ(Kartikeya Gummakonda) ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. ‘RX 100’ తో వెండితెర అరంగేట్రం చేసి, తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్న కార్తికేయ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరో గా నటించాడు. మధ్యలో నేచురల్ స్టార్ నాని ‘జెంటిల్ మ్యాన్’, తమిళ సూపర్ స్టార్ అజిత్ ‘వలిమై’ చిత్రాల్లో విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసాడు. ఆడియన్స్ లో మంచి విలక్షణ నటుడు అనే పేరు ని కూడా తెచ్చుకున్నాడు కార్తికేయ. అంతే కాదు కార్తికేయ మెగాస్టార్ చిరంజీవి కి వీరాభిమాని అనే సంగతి అందరికీ తెలిసిందే.
చిరంజీవి కోసం ప్రణాలిచ్చే రకం. ఒక ఈవెంట్ లో కార్తికేయ మెగాస్టార్ మీద చూపించిన ప్రేమకు, చిరంజీవి కళ్ళలో నుండి నీళ్లు కూడా తిరిగాయి. వీళ్ళ మధ్య అంత మంచి బాండింగ్ కూడా ఉంది. తాను ఎంతగానో అభిమానించే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విలన్ ఛాన్స్ రావడం కార్తికేయ కి నిజంగా అదృష్టం అనే చెప్పాలి. అనిల్ రావిపూడి సినిమాలను బాగా గమనిస్తే , ఒక్క ‘భగవంత్ కేసరి’ చిత్రం మినహా, మిగిలిన అన్ని సినిమాల్లోనూ విలన్స్ చేత తెగ కామెడీ చేయిస్తాడు. ఇందులో కార్తికేయ తో కూడా వేరే లెవెల్ కామెడీ చేయించే ప్రయత్నం చేయబోతున్నాడట అనిల్ రావిపూడి. గత ఏడాది విడుదలైన ‘భజే వాయు వేగం’ చిత్రం తర్వాత కార్తికేయ హీరో గా ఒక్క సినిమా కి కూడా సంతకం చేయలేదు. ఆయన కెరీర్ అంతంత మాత్రం గానే ఉంది. ఇలాంటి సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో అవకాశం దొరకడం చిన్న విషయం కాదు.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?