Chiranjeevi and Anil Ravipudi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతున్న ఆయన 70 సంవత్సరాల వయసులో కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఆయన అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఒక కొత్త సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక రీసెంట్ గా పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా తొందరలోనే రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతుంది…
అనిల్ రావిపూడి అంటే కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరుగా మారిపోయాడు. ఇప్పటివరకు ఆయన ఎనిమిది సినిమాలు చేస్తే ఆ ఎనిమిది సినిమాలు కూడా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించాయి అంటే ఆయన కమర్షియల్ ప్రేక్షకుల నాడీ తెలిసిన దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఏ హీరోకి ఎలాంటి సినిమా పడితే బాగుంటుంది అనేది ఆయనకు తెలిసినంత గొప్పగా మరే దర్శకుడికి తెలియదనే చెప్పాలి.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
ఇలాంటి సందర్భంలోనే చిరంజీవిలో సైతం హిలెరియస్ కామెడీని వాడుకుంటూనే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో ఈ సినిమాని తెరకెక్కించే ప్రయత్నం ఏదో చేస్తున్నారట…ఇక అందులో భాగంగానే చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ (Rowdy Alludu) సినిమాలోని ‘చిలుకా క్షేమమా’ అనే సాంగ్ మరోసారి రీమిక్స్ చేసి ఇందులో పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి ఆ సాంగ్ లో చిరంజీవి తనదైన రీతిలో స్టెప్పులు వేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా చాలా గొప్పగా నిలవడమే కాకుండా ఆయా ప్రొడ్యూసర్లకి భారీగా లాభాలను తీసుకొచ్చి పెడుతున్నాయి. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి కానుక వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vastunnaam) సినిమాతో వెంకటేష్ కి భారీ సక్సెస్ ని అందించిన ఆయన ఇప్పుడు చిరంజీవికి సైతం భారీ విజయాని అందించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…చూడాలి మరి ఈ సినిమాతో వీళ్లిద్దరూ ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ స్టార్ట్ అయ్యేది అప్పుడేనా..?