Jack Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు అందరూ కొత్త కథలను ఎంచుకుంటూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకునే ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) లాంటి నటుడు సైతం డీజే టిల్లు (Dj Tillu) సినిమాతో వరుస సక్సెస్ లను సాధించి ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఆయన బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో చేసిన ‘జాక్ ‘ (Jack) సినిమా ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా సిద్దు జొన్నలగడ్డ కెరియర్ లో మరో సక్సెస్ ని అందుకున్నాడా? లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
Sunny Deol : సన్నీ డియోల్ జాట్ సినిమా సక్సెస్ సాధించిందా..?బాలీవుడ్ ప్రీమియర్స్ రెస్పాన్స్ ఏంటి..?
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే జాక్ అనే వ్యక్తి ‘పాబ్ లో మెరోడ’ అనే ఒక కాన్ఫిడెన్షియల్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ జాబ్ లో అయిన ఎక్కడి వరకు వెళ్లాడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. తనకు అప్పజెప్పిన బాధ్యతను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడా? లేదా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) రాసుకున్న థీమ్ కంటెంట్ అయితే బాగుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఇంతకుముందు చేసిన ప్రతి సినిమాలో కూడా ఏదైతే చెప్పాలనుకుంటాడో ఆ కంటెంట్ అయితే ప్రేక్షకుడిని హత్తుకునే విధంగా ఉంటుంది. ఇక దానికి సరైన ట్రీట్మెంట్ రాసి ప్రేక్షకులకు చేరువ చేసే క్రమంలో కొన్ని సార్లు ఆయన తడబడ్డప్పటికి ఆయన థీమ్స్ మాత్రం ప్రేక్షకుడిని అలరిస్తూనే వస్తున్నాయి. ఇక ఈ జాక్ సినిమాలో కూడా ఆయన రాసుకున్న రైటింగ్ చాలా వరకు ప్లస్ అయింది. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఎక్కడ బోర్ కొట్టించకుండా చాలా ఎంగేజింగ్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు…
రా ఏజెంట్స్ సైతం పట్టుకోలేని కొన్ని విషయాలను జాక్ వచ్చి తన ఇంటిలిజెన్స్ మొత్తాన్ని వాడి వాళ్ళను పట్టుకునే సీన్స్ ఈ సినిమాకి చాలా హైలెట్ గా నిలిచాయి. సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్ ని మలిచిన విధానం అయితే చాలా బాగుంది. ఇక అక్కడక్కడ ఆయన క్యారెక్టర్ ను మలిచిన విధానం గాని ఆయన డైలాగ్ డెలివరీ కానీ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఏ స్థాయిలో ఎంటర్ టైన్ మెంట్ కావాలో ఆ రేంజ్ లో ఎంటర్ టైన్ మెంట్ అయితే అందించారు.
మొత్తానికైతే బొమ్మరిల్లు భాస్కర్ చాలా రోజుల తర్వాత ఒక ఇంటిన్స్ డ్రామాను వాడుకుంటూ సినిమా స్టోరీని రాసుకొని దాన్ని సిద్దూతో చేయాలని డిసైడ్ అవ్వడం అనేది ఈ సినిమాకి చాలా వరకు హెల్ప్ అయింది. ఎమోషనల్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. ప్రతి సీన్ లో కూడా డిటెలింగ్ ను బాగా ఫాలో అవుతూ బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి చాలా వరకు న్యాయం చేశాడు…ఈ కథని కామెడీ వేలో కూడా ప్రజెంట్ చేసి సక్సెస్ కొట్టచ్చు అని నిరూపించాడు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సిద్దు ఇంతకుముందు తను చేసినటువంటి డీజే టిల్లులో ఎలాంటి హిలేరియస్ పాత్రనైతే పోషించాడో ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రను చేస్తూనే సీరియస్ మూడున్న సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించి మెప్పించాడు. ముఖ్యంగా ఆయన చేసిన ఈ క్యారెక్టర్ ఆయనకి తప్ప వేరే వాళ్లకు సెట్ అవ్వదు అనే రేంజ్ లో నటించి మెప్పించాడు.
క్యారెక్టర్ లో కొంతవరకు వేరియేషన్స్ ఉండటంతో ఆయన ఇటు కామెడీ తో పాటు అటు ఇంటెన్స్ డ్రామా, ఎమోషన్స్ ని కూడా పండించే ప్రయత్నం చేశాడు… ఇక హీరోయిన్ వైష్ణవి చైతన్య తనకున్న పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది.ఇక ప్రకాష్ రాజ్ సైతం చేసిన పాత్ర సినిమాకి చాలా హై ఇచ్చింది. ఇక ఆయన కనిపించినంత సేపు సినిమా చాలా ఫస్ట్ ఫస్ట్ గా ముందుకు సాగుతుంది… ఇక మిగతా ఆర్టిస్టులందరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అచ్చు, శ్యామ్ సి ఎస్, సురేష్ బొబ్బిలి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్స్ గా వ్యవహరించారు. వీళ్లిచ్చిన సాంగ్స్ బాగున్నాయి. సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి…ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా వీళ్లు తీసుకున్న కేర్ సినిమా చూస్తున్నంత సేపు మనకు కనిపిస్తుంది. సినిమాటోగ్రాఫర్ విజయ్ చక్రవర్తి డిఫరెంట్ షాట్స్ తో చాలా కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశాడు. ఇక విజువల్స్ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యాయి. నవీన్ నూలీ కూడా తన కత్తెరకు చాలా చోట్ల పని చెప్పి సినిమాను గ్రిప్పింగ్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు…. మూవీకి అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి…
ప్లస్ పాయింట్స్
కథ
సిద్దు జొన్నలగడ్డ
ఎమోషనల్ సీన్స్
కామెడీ సీన్స్
మైనస్ పాయిట్స్
పెద్దగా ఏమీలేవు
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.50/5
