Chiranjeevi and Anil Ravipudi : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతుంది అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి మెగాస్టార్ తో చేతులు కలపడం తో ఈ సినిమాకు పాన్ ఇండియన్ మూవీ కి ఉన్నంత బజ్ ఏర్పడింది. ఈ చిత్రం లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనే దానిపై ఇన్ని రోజులు సోషల్ మీడియా లో అనేక పేర్లు వినిపించాయి. గత కొద్దిరోజుల క్రితమే నయనతార(Nayanthara) ఈ సినిమా లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వినిపించాయి. అయితే అధికారిక ప్రకటన రాకపోవడం తో వచ్చే వరకు ఎదురు చూసారు ఫ్యాన్స్. నేడు ఒక సర్ప్రైజ్ వీడియో తో నయనతార ఈ మూవీ సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
అనిల్ రావిపూడి మార్క్ ప్రొమోషన్స్, ప్రకటనలు ఎలా ఉంటాయో మన అందరికీ తెలిసిందే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఆ రేంజ్ హైప్ రావడానికి కారణం ఆయన డిజైన్ చేసిన స్పెషల్ ప్రొమోషన్స్ ఒక కారణం అని చెప్పొచ్చు. అలా తన స్టైల్ లోనే నయనతార తో ఒక వీడియో చేయించాడు. సాధారణంగా నయనతార ఇలాంటి ప్రొమోషన్స్ కి చాలా దూరం అనే సంగతి మన అందరికీ తెలిసిందే. కోట్ల రూపాయిలు అదనంగా ఇస్తామని చెప్పినా ఆమె ఒప్పుకోదు. కానీ ఈ సినిమాకు మాత్రం అనిల్ రావిపూడి ఒప్పించాడు. ఆమె ఒప్పుకోవడానికి కూడా కారణం స్వయంగా చిరంజీవి అడగడం వల్లే. చిరంజీవి నోరు తెరిచి అడిగితే చేయకుండా ఉండేవాళ్ళు ఏ ఇండస్ట్రీ లో అయినా ఉంటారా చెప్పండి?, పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కూడా ఆయన చెప్పిన మాట వినాల్సిందే, ఇక నయనతార వినకుండా ఎలా ఉంటుంది?.
Also Read : రేపే చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ ప్రారంభోత్సవం..ముఖ్య అతిథి ఎవరంటే!
చిరంజీవి కాస్త రిక్వెస్ట్ గా అడగగానే క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేసింది నయనతార. ఆమె సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చే వీడియో నే ఇంత స్పెషల్ గా డిజైన్ చేస్తే, ఇక రాబోయే రోజుల్లో ఇలాంటి కంటెంట్స్ ఎన్ని వస్తాయో మీరే ఊహించుకోండి. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఆ వీడియో మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. వింటేజ్ చిరంజీవి మార్క్ కామెడీ టైమింగ్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. శంకర్ దాదా MBBS , అందరివాడు చిత్రాల తర్వాత చిరంజీవి కామెడీ జానర్ సినిమాలకు దూరమై చాలా కాలం అయ్యింది. అభిమానులు ఆయన్ని ఈ జానర్ లో చూడాలని ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. కాబట్టి ఈ చిత్రం కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కాకునగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.
An actress who effortlessly charms the masses and enchants the classes
The ever graceful queen, #Nayanthara joins the journey of #Mega157 ❤️
Witness her elegance and emotion on the big screen alongside Megastar @KChiruTweets in an @AnilRavipudi Entertainer
— Shine Screens (@Shine_Screens) May 17, 2025