Hari Hara Veeramallu : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు మాత్రమే కాదు, టాలీవుడ్ మొత్తం ఇప్పుడు ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) మూవీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘గేమ్ చేంజర్’ తర్వాత మన టాలీవుడ్ నుండి రాబోతున్న అతి పెద్ద భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన నుండి విడుదల అవుతున్న మొట్టమొదటి సినిమా కావడంతో అభిమానులు ఈ చిత్రం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అంతే కాదు, అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి విడుదల కాబోతున్న స్ట్రెయిట్ సినిమా ఇదే. రీ ఎంట్రీ తర్వాత ఎక్కువగా ఆయన రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఒకానొక దశలో అభిమానులకు కూడా చిరాకు కలిగింది. అలాంటి ఫేస్ నుండి బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ఇది.
Also Read : ‘పుష్ప 2’ మేకర్స్ చేతుల్లోకి ‘హరి హర వీరమల్లు’..ఇక ఫ్యాన్స్ కి ప్రతిరోజు పండగే!
అనేక వాయిదాల తర్వాత జూన్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు నిన్న ఒక అధికారిక ప్రకటన చేసారు మేకర్స్. ప్రొమోషన్స్ కూడా ఇక నుండి వేరే లెవెల్ లో ఉండబోతున్నాయి. ఈ నెల 21న ఈ చిత్రానికి సంబంధించిన మూడవ పాటని విడుదల చేయబోతున్నారు. ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి, ఆ ప్రెస్ మీట్ లోనే ఈ పాటను విడుదల చేస్తారట. అంతే కాకుండా ట్రైలర్ విడుదల తేదీని కూడా ఆ ప్రెస్ మీట్ లోనే ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. అన్ని మీడియా చానెల్స్ కి ఈమేరకు ఆహ్వానం కూడా పంపించారట మేకర్స్. అయితే కాసేపటి క్రితమే ఈ చిత్రం డైరెక్టర్ జ్యోతి కృష్ణ ట్విట్టర్ లో కొన్ని ఫోటోలను అప్లోడ్ చేశాడు. ‘హరి హర వీరమల్లు’ గ్రాఫిక్స్ మరియు డబ్బింగ్ వర్క్స్ లో మా టీం ఫుల్ బిజీ గా ఉందని, 24 గంటలు పని చేస్తూనే ఉన్నామని చెప్పుకొచ్చాడు.
డబ్బింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు తీసిన ఫొటోలో LED స్క్రీన్ పై పవన్ కళ్యాణ్ ఫైట్ చేస్తున్న ఫోజుని చూసి అభిమానులు మెంటలెక్కిపోతున్నారు. మా హీరో ని మామూలు రేంజ్ లో చూపించలేదుగా, అదిరిపోయింది,ఇదే మాకు కావాల్సింది అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రం లో బాబీ డియోల్ ఔరంగజేబు క్యారక్టర్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆయనకు సంబంధించిన లుక్స్ కూడా అందులో ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు అభిమానులు ‘హరి హర వీరమల్లు’ పై కావాల్సినంత హైప్ లేదని బాధపడుతూ ఉండేవారు. కానీ నిన్నటి నుండి హైప్ వేరే లెవెల్ కి చేరింది. ఫ్యాన్స్ మంచి ఉత్సాహం తో ఉన్నారు. ట్రైలర్ అదిరిపోయింది అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో, మరి నిజంగా ఆ రేంజ్ లో ఉందా లేదా అనేది తెలియాలంటే మరో వారం రోజులు వేచి చూడక తప్పదు.
The team who saw #HHVM first is buzzing! Dubbing crew, sound engineer Pappu Garu, assistant engineer Srinivas Garu, and co-director K.Ranganath are all in. CG & dubbing in full swing 24/7! ️Join us soon on Twitter Spaces! ✨#HariHaraVeeraMallu #HHVMonJune12th #HHVM pic.twitter.com/amRUBQ3wZD
— jyothi krisna (@amjothikrishna) May 17, 2025