Chartered Accountant : ఛార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) చదవడం చాలా కష్టం. రోజులో నిద్రకు 8 గంటలు వదిలేసి 16 గంటలు చదివినా కూడా కష్టమే. చాలా మంది సీఏ స్టూడెంట్స్ రోజులో గంటల తరబడి కూర్చోని మరి సీఏకి చదువుతుంటారు. రాత్రి పగలు నిద్ర లేకుండా చాలా మంది సీఏకి చదువుతుంటారు. ఎందుకంటే ఈ పరీక్షలు చాలా కష్టంగా ఉంటాయి. వీటిని చదివి పాస్ కావాలంటే కాస్త కష్టమే. అయితే సీఏ చదువుతున్న అభ్యర్థులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు సీఐ ఫైనల్ పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించేవారు. కానీ ఇకపై ఏడాదికి మూడు సార్లు సీఏ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. అయితే ఈ రూల్ ఈ ఏడాది నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అయితే ఇవే కాకుండా ఇంటర్మీడియట్, ఫౌండేషన్ కోర్సులు కూడా ఇకపై ఏడాదికి మూడు సార్లు నిర్వహించాలని గతేడాది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ఇకపై సీఏ ఫైనల్ పరీక్షలు కూడా ఇలానే జరుగుతాయని తెలిపింది. విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు ఉండటం కోసం ఏడాదికి మూడు సార్లు పరీక్షలను నిర్వహించనుంది. ఇప్పటి వరకు సీఏ ఫైనల్ పరీక్షలు అన్ని కూడా ఏడాదికి రెండు సార్లు మాత్రమే జరిగేవి. కానీ ఇకపై మూడు సార్లు జరుగుతాయి.
Also Read : 75% హాజరు తప్పనిసరి, కఠిన నిబంధనలతో విద్యార్థులకు సవాల్
సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, ఫౌండేషన్ అన్ని కూడా ఇకపై ఏడాదికి మూడు సార్లు జరుగుతాయి. దీనివల్ల సీఏ పరీక్షలు రాసే వారి సంఖ్య కూడా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. అయితే పరీక్షలను మూడు సార్లు జనవరి, మే, సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తారు. దీనివల్ల విద్యార్థులకు కూడా కాస్త భారం తగ్గుతుంది. అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ కోర్సు ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టెమ్స్ ఆడిట్లో కూడా కొన్ని మార్పులు చేయనున్నట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. గతంలో సీఏ పరీక్షలు ఏడాదిలో రెండుసార్లు జరిగేవి. మూడు సార్లు మార్చడానికి ముఖ్యంగా కారణం.. దేశంలో ఉన్న అత్యంత కఠినమైన పరీక్షల్లో సీఏ ఒకటి. దీని కోసం విద్యార్థులు ఎంతగానో కష్టపడుతుంటారు. అందుకే ఏడాదికి మూడు సార్లు పరీక్షలను నిర్వహించాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా భావించింది.