Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ మోటార్‌సైకిల్ బజాజ్ ఫ్రీడమ్ 125 మనదేశంలో జూలై 2024లో విడుదలైంది. బజాజ్ ఫ్రీడమ్ ఒక స్ట్రీట్ బైక్, ఇది 3 వేరియంట్లు , 7 రంగుల్లో అందుబాటులో ఉంది. బజాజ్ ఫ్రీడమ్‌లో 125సీసీ BS6 ఇంజన్ ఉంది. ఇది 9.3 bhp పవర్, 9.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్రంట్ డిస్క్ మరియు రియర్ డ్రమ్ బ్రేక్‌లతో, బజాజ్ ఫ్రీడమ్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఫ్రీడమ్ బైక్ బరువు 149 కిలోగ్రాములు మరియు దీని ఇంధన ట్యాంక్ సామర్థ్యం 2 లీటర్లు. విశేషమేమిటంటే, ఈ బైక్ చాలా తక్కువ సమయంలో 50 వేల యూనిట్ల అమ్మకాల మార్క్‌ను దాటింది.
బజాజ్ ఫ్రీడమ్‌లో 2 కిలోల సీఎన్‌జీ ట్యాంక్ కూడా ఉంది. దీనిని బైక్ మధ్య భాగంలో అమర్చారు. 2.0-లీటర్ల పెట్రోల్ ట్యాంక్‌ను సీఎన్‌జీ ట్యాంక్ పైన, ముందు భాగంలో ఉంచారు, సాధారణంగా బైక్‌లలో ఇంధన ట్యాంక్ ఎక్కడ ఉంటుందో అక్కడ. ఈ రెండూ కలిసి 330 కిలోమీటర్ల పరిధిని అందిస్తాయని కంపెనీ పేర్కొంది. సీఎన్‌జీ, పెట్రోల్ రెండింటికీ ఒకే కామన్ ఫిల్లర్ క్యాప్ ఉంది. రైడర్ ఒక స్విచ్ నొక్కడం ద్వారా సీఎన్‌జీ నుండి పెట్రోల్‌కు, పెట్రోల్ నుండి సీఎన్‌జీకి మారవచ్చు. సీఎన్‌జీ, పెట్రోల్ రెండింటి సగటు మైలేజ్ 91 కిమీలుగా తేలింది.
డిజైన్ విషయానికి వస్తే, టాప్ రెండు వేరియంట్లలో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, డర్ట్ బైక్-స్టైల్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన సీటు లభిస్తాయి, ఇది ఈ సెగ్మెంట్‌లో అత్యంత పొడవైనదని బజాజ్ పేర్కొంది. ఈ సెగ్మెంట్‌లో లింక్డ్-టైప్ రియర్ సస్పెన్షన్‌ను కలిగి ఉన్న మొదటి బైక్ ఇది. ఇందులో 17-అంగుళాల ముందు, 16-అంగుళాల వెనుక చక్రాలు ఉన్నాయి. బ్రేకింగ్ కోసం ముందు డిస్క్ బ్రేక్, వెనుక డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. అయితే, బేస్ వేరియంట్‌లో ముందు కూడా డ్రమ్ బ్రేక్ ఉంటుంది.
ఫీచర్ల విషయానికి వస్తే, టాప్ రెండు వేరియంట్లలో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన రివర్స్ ఎల్‌సీడీ డిస్‌ప్లే లభిస్తాయి. బజాజ్ ఫ్రీడమ్ 7 రంగుల ఎంపికలలో లభిస్తుంది, అవి కరేబియన్ బ్లూ, ప్యూటర్ గ్రే-బ్లాక్, సైబర్ వైట్, ఎబోనీ బ్లాక్-గ్రే, రేసింగ్ రెడ్, ప్యూటర్ గ్రే-ఎల్లో, ఎబోనీ బ్లాక్-రెడ్. జాజ్ ఫ్రీడమ్ వేరియంట్ ఫ్రీడమ్ డ్రమ్ ధర రూ.1,07,494 నుండి ప్రారంభమవుతుంది. ఇతర వేరియంట్లు – ఫ్రీడమ్ డ్రమ్ ఎల్‌ఈడీ , ఫ్రీడమ్ డిస్క్ ఎల్‌ఈడీ ధరలు వరుసగా రూ.1,12,935, రూ.1,29,234. ఇక్కడ పేర్కొన్న ధరలు ఢిల్లీలోని ఆన్-రోడ్ ధరలు. ఈ బైక్ ఈ సెగ్మెంట్‌లో టీవీఎస్ రైడర్ 125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125ఆర్, బజాజ్ పల్సర్ ఎన్ఎస్125, హోండా షైన్ 125 లకు పోటీ ఇస్తుంది.