https://oktelugu.com/

Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించిన … చిరంజీవి, వెంకటేష్

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో కర్ణాటక వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పునీత్ లేని లోటుతో భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. తమ అభిమాన పునీత్ రాజ్ కుమార్ ఇక లేరనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  పునీత్ ను చివరిసారి దర్శించుకుని నివాళులు అర్పించడానికి… అభిమానులు భారీగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి తరలి వస్తున్నారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నివాళులు అర్పించేందుకు బెంగుళూరు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 30, 2021 / 06:26 PM IST
    Follow us on

    Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో కర్ణాటక వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి. పునీత్ లేని లోటుతో భారతీయ సినిమా పరిశ్రమ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. తమ అభిమాన పునీత్ రాజ్ కుమార్ ఇక లేరనే వార్తను ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.  పునీత్ ను చివరిసారి దర్శించుకుని నివాళులు అర్పించడానికి… అభిమానులు భారీగా బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి తరలి వస్తున్నారు.

    కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నివాళులు అర్పించేందుకు బెంగుళూరు లోని కంఠీరవ స్టేడియానికి సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా వస్తున్నారు.  తాజాగా పునీత్‌ రాజ్‌ కుమార్‌ భౌతిక ఖాయాన్ని టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌ సందర్శించారు. పునీత్‌ రాజ్‌ కుమార్‌ కు నివాళులు అర్పించారు. చిరంజీవి, వెంకటేష్‌ తో పాటు శ్రీకాంత్‌, ఆలీ కూడా పునీత్‌ రాజ్‌ కుమార్‌ కు నివాళులర్పించారు.

    ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు చిరు. చిన్న వయసులోనే పునీత్‌ మనల్ని వదిలి వెళ్లడం బాధాకరమన్నారు. పునీత్‌ సోదరుడు శివరాజ్‌ను హత్తుకొని చిరంజీవి ఓదార్చారు. పునీత్‌ మరణం తీరని లోటని హీరో వెంకటేశ్‌ అన్నారు. మరోవైపు పునీత్‌ రాజ్‌కుమార్‌ కూతురు ధృతి రాజ్‌కుమార్‌ బెంగళూరుకు చేరుకుంది. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో తమ అభిమాన హీరోను చివరిసారిగా చూసేందుకు పునీత్‌ అభిమానులు వేలాదిగా తరలి వస్తున్నారు. కాగా పునీత్ అంత్యక్రియలను రేపటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ  లాంఛనాలతో పునీత్ అంత్యక్రియలు జరపనున్నారు.