https://oktelugu.com/

Rgv: రొమాంటిక్ మూవీపై ఆర్జీవి ట్వీట్ రిప్లై ఇచ్చిన రొమాంటిక్ హీరోయిన్…

Rgv: రామ్ గోపాల్ వర్మ… తనదైన శైలిలో ఎప్పుడు ఏదో ఒక విషయంపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సినిమాల పరంగా కన్నా ఆర్జీవి… ఇంటర్వ్యూలు, ట్విట్టర్ లో ట్వీట్ ల ద్వారా కూడ ఆ రేంజ్ లో ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన రొమాంటిక్ చిత్రంపై తనదైన శైలిలో ట్వీట్ చేశారు ఈ విమర్శక దర్శకుడు. అనీల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 30, 2021 / 06:06 PM IST
    Follow us on

    Rgv: రామ్ గోపాల్ వర్మ… తనదైన శైలిలో ఎప్పుడు ఏదో ఒక విషయంపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సినిమాల పరంగా కన్నా ఆర్జీవి… ఇంటర్వ్యూలు, ట్విట్టర్ లో ట్వీట్ ల ద్వారా కూడ ఆ రేంజ్ లో ఫేమస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు తాజాగా విడుదలైన రొమాంటిక్ చిత్రంపై తనదైన శైలిలో ట్వీట్ చేశారు ఈ విమర్శక దర్శకుడు.

    అనీల్ పాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో ఆకాష్ పూరి హీరోగా, కేతికా శర్మ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలానే ఈ సినిమా లో కేతిక  శర్మ తన హాట్ నెస్ తో ఈ చిత్రాన్ని మరొక రేంజ్ కు తీసుకు వెళ్ళింది అని చెప్పాలి. ఆకాష్ పూరి తన గత సినిమాల కన్నా ఈ చిత్రంలో బాగానే నటించారని అంటున్నారు. కాగా ఈ చిత్రానికి అభిమానులు, సెలబ్రిటీ ప్రశంసలు అందిస్తున్నారు. అయితే ఇటీవల ఈ మూవీపై ఆర్జీవి ఒక ట్వీట్ చేశారు.

    https://twitter.com/RGVzoomin/status/1454098981164699654?s=20

    రొమాంటిక్ థండర్ స్టార్ ఆకాష్ పూరి, రొమాంటిక్ హాట్ బ్యూటీ కేతిక శర్మ అంటూ కామెంట్స్ చేశారు. ఆకాష్ – కేతిక తమ కెమిస్ట్రీతో బాక్సాఫీస్‌ను బర్న్ చేస్తున్నారు. ఈ సినిమాను రూపొందించిన దర్శకుడు అనీల్ పాదూరి, నిర్మాతలు పూరి, ఛార్మిలకు సెల్యూట్ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. హీరోయిన్ కేతిక శర్మ ఈ ట్వీట్‌కి స్పందించారు “థాంక్యూ సర్ ” అంటూ రిప్లై ఇచ్చింది. కేతిక శర్మ రీట్వీట్ కు వర్మ రిప్లై ఇస్తూ ‘హే కేతిక మాకు హాట్ అండ్ రొమాంటిక్ ఫీల్ అందించిన నీకు ఆడియన్స్, నేను థాంక్స్ చెప్పాలి అంటూ మళ్ళీ ట్వీట్ చేశారు రాంగోపాల్ వర్మ.