Ali Daughter Marriage: హాస్య నటుల్లో ఆలీకి ప్రముఖ స్థానం ఉంటుంది. హాస్యంలో తనను మించిన వారు ఎవరుండరు. జోకులు చేయడంలో ఆలీకి మంచి అభిరుచి ఉంటుంది. ఎదుటి వారిని నవ్వించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సినిమాల్లో సహజంగా నటిస్తూ అందరిని మెప్పిస్తున్నారు. ఎన్నో సినిమాల్లో నటించి తన హాస్యం పంచుతూ అలరిస్తున్నాడు. ఈటీవీలో అలీతో సరదాగా అనే కార్యక్రమం ద్వారా పలువురిని ఇంటర్వ్యూ చేస్తూ వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. అలా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. 1979లో వెండితెరకు పరిచయమైన అలీ ఇప్పటివరకు వెయ్యికి పైగా సినిమాల్లో నటించారు. అలీకి ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నారు.
హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ లో తన పెద్ద కూతురు ఫాతిమా వివాహం ఆదివారం ఘనంగా జరిపించారు. దీనికి సినీ పరిశ్రమకు చెందిన దిగ్గజాలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి సెలబ్రిటీలు హాజరై ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఏపీ మంత్రి రోజా కూడా హాజరై వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
వారంతా అలీతో సరదాగా మాట్లాడారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ర్టానిక్ మీడియా సలహాదారుగా అలీని నియమించారు. అలీ కుమార్తె వివాహానికి పెద్ద ప్రముఖులు అందరు కూడా విచ్చేసి నూతన వధూవరులకు విషెష్ తెలిపారు. వచ్చిన అతిథులతో ఫంక్షన్ హాల్ సందడిగా మారింది. దీంతో అలీ దంపతులు వచ్చిన వారికి ఆహ్వానం పలికి వారికి కావాల్సిన మర్యాదలు చేశారు. వారితో మనసు విప్పి మాట్లాడారు.
అలీ కుమార్తె వివాహం వారి సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. వచ్చిన పెద్దలు కూడా వారిని పలకరించారు. ఆహుతులతో వేదిక సందడిగా మారింది. అందరు సెలబ్రిటీలు కావడంతో వారికి మర్యాదలు కూడా అదే రేంజ్ లో ఏర్పాటు చేశారు. చిరంజీవి, నాగార్జున దంపతులతో వచ్చారు. వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో అలీ దంపతులు వచ్చిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికి పేరుపేరున పలికి అందరి మదిని దోచారు.