Kannappa : ఒక స్టార్ హీరోకి సంబంధించి ఏదైనా ఫస్ట్ లుక్, లేదా టీజర్ వచ్చినప్పుడు సోషల్ మీడియా మొత్తం చాలా సందడిగా ఉంటుంది. అభిమానులు వాటిని ఎంజాయ్ చేస్తే, దురాభిమానులు ట్రోల్స్ చేస్తూ, ఫన్నీ మీమ్స్ చేస్తూ ఉంటారు. నేడు ‘కన్నప్ప’ చిత్రం లోని రెబల్ స్టార్ ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియా లో వచ్చిన ఫన్నీ ట్రోల్స్ మామూలైవి కాదు. పవన్ కళ్యాణ్, ప్రభాస్, రామ్ చరణ్ అభిమానులు ఒక జట్టు అయితే, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు అభిమానులు మరో జట్టు. ఇలా రెండు గ్రూప్స్ గా ఏర్పడి ఒకరిపై ఒకరు వేసుకుంటున్న ట్రోల్స్, మీమ్స్ తో ఇప్పుడు సోషల్ మీడియా నిండిపోయింది. కొంతమంది అయితే ప్రభాస్ లుక్ ని ‘దేశముదురు’ లోని కమెడియన్ అలీ లుక్ తో పోలుస్తూ కొన్ని మీమ్స్ చేసారు , అది బాగా వైరల్ అయ్యింది.
మరికొంతమంది అయితే శక్తి లోని ఎన్టీఆర్ లుక్స్ ని, నేడు విడుదలైన ప్రభాస్ లుక్స్ తో పోలుస్తూ ఎన్టీఆర్ ని ట్రోల్ చేసారు. అదే విధంగా ‘డమరుకం’ చిత్రంలోని అంధకాసుర లుక్ తో ప్రభాస్ లేటెస్ట్ లుక్ ని పిలిచి కొంతమంది వెక్కిరిస్తూ కొంతమంది ఎడిటింగ్ వీడియోలు కూడా చేసారు. ఈ ట్రోల్స్ మొత్తం అసభ్యకరంగా లేకుండా, ప్రభాస్ అభిమానులు సైతం నవ్వుకునే రేంజ్ లో ఉన్నాయి. నేడు విడుదలైన అన్ని మీమ్స్ లో ‘దేశముదురు’ లోని అలీ గెటప్ తో పోలుస్తూ తయారు చేసిన మేము సోషల్ మీడియా లో ఎక్కువ ట్రెండ్ అవుతుంది. అయితే ట్రోల్స్ సంగతి కాసేపు పక్కన పెడితే అభిమానుల్లో కన్నప్ప విషయంలో కాస్త భయం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్ లో ఎలాంటి క్వాలిటీ లేదు.
అన్ని నాసిరకంగానే ఉన్నాయని అభిమానుల అభిప్రాయం. మంచు విష్ణు లాస్ ఏంజిల్స్ లో కూర్చొని VFX వర్క్స్ చెయ్యిస్తున్నానని పలు మార్లు చెప్పాడు. అక్కడి నుండి ఇలాంటి ప్రోడక్ట్ వస్తుందా?, ఏదైనా తేడా జరిగితే ఊరుకోము అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటి నుండే వార్నింగ్స్ ఇస్తున్నారు. పీరియాడిక్ గెటప్స్ లో ప్రభాస్ ని మించినోడు ఇండస్ట్రీ లో ఎవ్వరూ లేరు. అలాంటి పీరియాడిక్ రోల్ కి సంబంధించిన లుక్స్ ఇంతలా ట్రోల్స్ కి గురవుతుందంటే, కచ్చితంగా మూవీ టీం దే బాధ్యత. కనీసం సినిమాలో అయినా అభిమానులు కోరుకునే క్వాలిటీ ని చూపిస్తారో లేదో చూడాలి. అక్షయ్ కుమార్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ట్రోల్స్ కి గురైంది. ఇందులో ఆయన శివుడి క్యారక్టర్ చేస్తున్న సంగతి తెలిసింది. శివుడు కంఠం నీలంగా ఉంటుంది కాబట్టి, అక్షయ్ కుమార్ కంఠానికి నీలం రంగు అద్దినట్టే ఉంది కానీ , నేచురల్ గా లేదు. ఇవన్నీ చూసుకోవాలి, లేకపోతే 200 కోట్లు బడ్జెట్ పెట్టి ఉపయోగం లేదు.