Rajendra Prasad takes shocking decision : టాలీవుడ్ లో లెజండరీ నటుల లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) పేరు ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ హీరో లాగా కాకుండా, కామెడీ జానర్ లో సినిమాలు చేసి కామెడీ హీరో గా ఆరోజుల్లో ఆయన సృష్టించిన ప్రభంజనాన్ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. ఇప్పటికీ ఆయన నటుడిగా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ నేటి తరం ఆడియన్స్ కి కూడా బాగా దగ్గరయ్యాడు. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య కాలం లో రాజేంద్ర ప్రసాద్ నెటిజెన్స్ చేత విపరీతంగా ట్రోల్ కాబడుతున్నాడు. నాలుగు దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు. ఏనాడు కూడా ఆయన నెటిజెన్స్ నుండి ఇంతటి నెగటివిటీ చూడలేదు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఈమధ్య కాలం లో స్టేజి మీద మాట్లాడేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ నోరు అదుపు తప్పుతోంది. తోటి నటీనటులపై నోరు పారేసుకుంటున్నాడు.
రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పై ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో పెను దుమారం రేపింది. డేవిడ్ వార్నర్ కి మన తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. SRH టీం కి ఆయన రెండు సార్లు కప్ అందేలా చేసాడు. అంతే కాకుండా మన తెలుగు సినిమాలంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో తెలుగు సినిమా లోని పాపులర్ క్యారెక్టర్స్ కి సంబంధించిన గెటప్స్ ని వేసుకుంటూ అప్లోడ్ చేసిన ఫోటోలు వీడియోలు ఎంత వైరల్ అయ్యాయో మన అందరికీ తెలిసిందే. అలా తెలుగు సినిమాల మీద ఇష్టం తోనే ‘రాబిన్ హుడ్’ చిత్రం చేసాడు. అలాంటి వ్యక్తిని అవమానించడం చాలా పెద్ద తప్పు అంటూ మండిపడ్డారు. ఇక రీసెంట్ SV కృష్ణా రెడ్డి జన్మదిన వేడుకల్లో కమెడియన్ అలీ పై అత్యంత నీచంగా మాట్లాడిన కొన్ని మాటలు పెను దుమారం రేపాయి.
Also Read : డేవిడ్ వార్నర్ ని అడ్డమైన బూతులు తిట్టిన రాజేంద్ర ప్రసాద్..వీడియో వైరల్!
దీనిపై అలీ స్పందిస్తూ ‘ఆయన చాలా పెద్ద మనిషి. ప్రస్తుతం కూతురు కోల్పోయిన బాధలో ఉన్నాడు. సోషల్ మీడియా లో నెగటివిటీ గమనించాను. దయచేసి ఇక ఆపేయండి’ అంటూ ఒక వీడియో విడుదల చేసాడు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా రాజేంద్రప్రసాద్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇటీవల కాలం లో జరిగిన సంఘటనల గురించి ప్రస్తావిస్తూ ‘నేను మాట్లాడిన వాళ్లంతా నా కుటుంబ సబ్యులు. మా మధ్య ఎన్నో ఉంటాయి, చాలా సరదాగా ఉంటాము మేమంతా. కానీ ఈమధ్య సభలో అవి బయటపడుతున్నాయి. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా చివరి శ్వాస వరకు ఇక మీదట ఎవరికైనా మర్యాద ఇచ్చే మాట్లాడుతాను. ఇంకో రకంగా జీవితం లో ఎప్పుడు మాట్లాడను’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘రాబిన్ హుడ్’ సమయం లో ట్రోల్స్ ఎదురైనప్పుడు కూడా రాజేంద్ర ప్రసాద్ ఇలాగే మాట్లాడాడు. కానీ ఇప్పుడు మళ్ళీ నోరు జారాడు అంటూ నెటిజెన్స్ గుర్తు చేస్తున్నారు.
ఈ క్షణం నుంచి నా చివరి శ్వాస వరకూ అందరికీ మర్యాద ఇచ్చే మాట్లాడతాను – #RajendraPrasad pic.twitter.com/oEb0DXL2MA
— Rajesh Manne (@rajeshmanne1) June 4, 2025