Chiranjeevi And Balakrishna: శ్రీ ‘నందమూరి తారక రామారావు’ గారి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీని చాలా సంవత్సరాల పాటు శాసించాడనే విషయం మనందరికీ తెలిసిందే. అలాగే తమిళ్ సినిమా ఇండస్ట్రీ తో పాటు పోటీ పడుతూ మరి తెలుగులో భారీ సక్సెస్ లను అందిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎవ్వరూ కంటే తక్కువ కాదు అనేలా మనకంటూ ఒక స్టాండర్డ్ ని సెట్ చేసి పెట్టాడు. తర్వాత ఆయన కొడుకు అయిన బాలకృష్ణ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా బాలయ్య బాబు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ సందర్భంలో ఆయనకు సంబంధించిన ఒక ఈవెంట్ ని కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నిర్వహించడం విశేషం. ఇక ఈ ఈవెంట్ లో చిరంజీవి, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. ఇక ఈ క్రమంలో చిరంజీవి బాలయ్య బాబు గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. తను ఇంద్ర లాంటి ఒక ఫ్యాక్షన్ సినిమా చేయడానికి బాలయ్య బాబు చేసిన ‘ సమరసింహా రెడ్డి ‘ సినిమానే తనకి ఇన్స్పిరేషన్ అంటూ చిరంజీవి చెప్పడం విశేషం..
అలాగే ఇప్పుడొస్తున్న సీక్వెల్ ప్రీక్వేల్ సినిమాలను ఉద్దేశిస్తూ చిరంజీవి ఇంద్ర సేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి లాంటి ఒక కథని రెడీ చేయమని ప్రస్తుతం ఉన్న యంగ్ దర్శకులతోపాటు బోయపాటి శీను లాంటి మాస్ డైరెక్టర్లకి కూడా ఒక సలహాని అందించాడు. మరి వాళ్ళు తొందర్లో కథని కనక తమ దగ్గరికి తీసుకొస్తే ఆ సినిమాలో నటించడానికి అటు బాలయ్య, ఇటు చిరంజీవి ఇద్దరు సిద్ధంగా ఉన్నామని ఆ స్టేజ్ మీద చెప్పడం ప్రతి ప్రేక్షకుడిని ఆనందమయం చేసిందనే చెప్పాలి.
నిజానికి చిరంజీవి లాంటి స్టార్ హీరో బాలయ్య బాబు గురించి చాలా గొప్పగా చెబుతుంటే అటు బాలయ్య బాబు అభిమానులతో పాటు, మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. బాలయ్య బాబు చిరంజీవి లను ఒక వేదిక మీద చూసి చాలా సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది అంటూ మరికొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లను కూడా చేస్తున్నారు.
ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ సినిమా రాబోతుందనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది… ఇక అలాగే ప్రస్తుతం వీళ్ళిద్దరూ కూడా భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తూ తమ అభిమానులను ఆనందానికి గురి చేస్తూ ముందుకు దూసుకెళ్ళడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి…