https://oktelugu.com/

KCR : కేసీఆర్ గతంలో చెప్పినట్టు క్లౌడ్ బరస్ట్ కాదట.. ఇంతటి వర్షాలకు కారణం అదేనట

గత ఏడాది ఇదే కాలంలో విస్తారంగా వర్షాలు కురిసాయి. కాలేశ్వరం పంపు హౌస్ లు నీట మునిగాయి. ఆ సమయంలో విపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి.. దానికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా కుట్రని, క్లౌడ్ బరస్ట్ అని పేర్కొన్నారు. అప్పట్లో ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల రకరకాల విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతం కూడా అదే స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే నాడు కెసిఆర్ చెప్పినట్టు ఇంతటి వర్షాలకు క్లౌడ్ బరస్ట్ కారణం కాదట, చైనా కుట్ర కానే కాదట.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 2, 2024 / 12:15 PM IST

    KCR Comments On Cloud burst

    Follow us on

    KCR : కుంభవృష్టి.. కుండ పోత.. మేఘాల విస్ఫోటనం.. ఈ ఉపోద్ఘాతాలు కూడా సరిపోవు. శుక్ర, శని వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీకి మించిన వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో 30 కి మించి సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ముఖ్యంగా ఏపీలోని కృష్ణ, గుంటూరు, తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసాయి. వాస్తవానికి ఈ స్థాయిలో వర్షపాతం గతంలో ఎన్నడూ నమోదు కాలేదు. చాలామంది మేఘాలు బద్దలయ్యాయా? వరుణుడు తన కోపాన్ని మొత్తం ఈ జిల్లాల మీద చూపించాడా? సోషల్ మీడియా లో వ్యాఖ్యానించారు. అయితే దీనికి వాతావరణ నిపుణులు చెబుతున్న అసలు కారణం మరో విధంగా ఉంది.

    నైరుతి రుతుపవనాల కాలంలో..

    నైరుతి రుతుపవనాల కాలంలో అల్పపీడనాలు, వాయుగుండాలు సర్వసాధారణంగా ఏర్పడుతుంటాయి. అయితే ఇవి ఎక్కువగా నైరుతి ప్రాంతంలో వర్షిస్తుంటాయి. అల్పపీడనాలకు, వాయుగుండాలు నైరుతి భాగంలో కుంభవృష్టి స్థాయిలో వర్షాలు కురుస్తాయి. అందువల్లే ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ఖమ్మం, వరంగల్ జిల్లాలో విపరీతంగా వర్షాలు కురిసాయి.. నైరుతి కాలంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేదా వాయు గుండాలు ఏర్పడుతుంటాయి. ఈ సమయంలో అరేబియా సముద్రం నుంచి మేఘాలు భారీగా తేమను గ్రహించినప్పుడు పశ్చిమ కనుమలు, బంగాళాఖాతం నుంచి వచ్చే తేమ వల్ల ఈశాన్య ప్రాంతాలలో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. దీనికి వాతావరణంలో మరికొన్ని పరిస్థితులు తోడైతే స్థాయిలో వర్షాలు కురుస్తాయి.. శుక్ర, శని, ఆది వారాల్లో కురిసిన వర్షాలు అందువల్లేనని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాల కాలంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు భూమ్మీదికి వచ్చే సమయంలో భారీగా తేమను మోసుకువస్తుంటాయి. ఆ సమయంలో నైరుతి భాగంలో ఎక్కువగా తేమ కేంద్రీకృతమై ఉంటుంది. మిగతా ప్రాంతాలలో మామూలుగా వర్షాలు కురుస్తుంటాయి.

    తీవ్రమైన ఎండల వల్ల అనిశ్చిత వాతావరణం

    ఆగస్టు నెలలో తీవ్రమైన ఎండల వల్ల భూమి వేడెక్కింది. సముద్రం కూడా తీవ్రంగా వేడెక్కింది. ఫలితంగా అటు భూమి, ఇటు సముద్రంపై ఆనిశ్చితి వాతావరణ ఏర్పడింది. ఈ ప్రభావాలతో వాయుగుండం స్థాయికి మించి సముద్రం నీటిని స్వీకరించింది. అదే స్థాయిలో భూమ్మీదికి వదిలింది. అలా వదిలిపెట్టిన ప్రాంతం లో విపరీతమైన వర్షాలు కురిసాయి. అయితే ఈ స్థాయిలో వర్షాలకు క్లౌడ్ బరస్ట్ కారణం కాదని వాతావరణ నిపుణులు వివరిస్తున్నారు. ఒకటి లేదా రెండు గంటల వ్యవధిలో కొద్ది ప్రాంతాల పరిధిలో విపరీతమైన వర్షాలు కురిస్తే దానిని క్లౌడ్ బరస్ట్ అని పిలుస్తారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.