మెగా న్యూస్: ‘ఆచార్య’ రీ షూటింగ్ ఎప్పుడంటే?

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ మూవీలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. దీంతో ఈ మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ‘ఆచార్య’ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న క్రమంలోనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా వాయిదా పడింది. కరోనా ఎఫెక్ట్ తో […]

Written By: NARESH, Updated On : November 4, 2020 8:13 pm
Follow us on

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ మూవీలో చిరంజీవికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. దీంతో ఈ మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

‘ఆచార్య’ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న క్రమంలోనే కరోనా ఎంట్రీ ఇవ్వడంతో సినిమా వాయిదా పడింది. కరోనా ఎఫెక్ట్ తో ‘ఆచార్య’ గత ఆరేడు నెలలుగా నిలిచిపోయింది. కొద్దిరోజులుగా టాలీవుడ్లో సినిమాల సందడి మొదలైనప్పటికీ ‘ఆచార్య’ షూటింగ్ పై ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు.

Also Read: గుడ్ న్యూస్: మెగా డాటర్ పెళ్లి ఎప్పుడు? ఎక్కడంటే?

‘ఆచార్య’ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రయూనిట్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 9నుంచి ‘ఆచార్య’ రీ షూటింగ్ ప్రారంభం కానుందని.. 2021వేసవిలో థియేటర్లలో మెగా సందడి మొదలు కానుందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీంతో మెగా అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Also Read: బోయపాటి దర్శకత్వంలో మరో వారసుడు !

‘ఆచార్య’లో చిరంజీవి డ్యుయల్ రోల్స్ చేస్తుండగా అజయ్.. సోనూసుద్.. హిమజ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ‘ఆచార్య’కు అదిరిపోయే బాణీలను సమకూరుస్తున్నాడు. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్‌ తోపాటు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.