https://oktelugu.com/

ఏపీలో పాఠశాలలో కరోనా కలకలం.. టెన్షన్ లో విద్యార్థులు..?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రతిరోజూ అంచనాలను మించి కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఏపీలో ఈ నెల 2వ తేదీ నుంచి పాఠశాలలు, కాలేజీలు ఓపెన్ అయ్యాయి. అయితే అందరూ భయపడిన విధంగానే పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ ప్రకాశం జిల్లాలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 4, 2020 / 04:56 PM IST
    Follow us on

    దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. ప్రతిరోజూ అంచనాలను మించి కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. ఏపీలో ఈ నెల 2వ తేదీ నుంచి పాఠశాలలు, కాలేజీలు ఓపెన్ అయ్యాయి. అయితే అందరూ భయపడిన విధంగానే పాఠశాలల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    ప్రకాశం జిల్లాలోని నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు వెలుగు చూసినట్లు సమాచారం. జిల్లాలోని జరుగవల్లి మండలం పచ్చవ గ్రామంలో ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. విద్యార్థులతో పాటు త్రిపురాంతకం హైస్కూల్ లో ఒక ఉపాధ్యాయుడికి, పెద్దగొప్పపల్లి పాఠశాలలో మరో ఉపాధ్యాయుడికి కరోనా నిర్ధారణ అయింది. పాఠశాలల్లో కరోనా కేసులు నమోదు కావడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

    Also Read: స్థానిక ఎన్నికలకు వైసీపీ నై.. టీడీపీ సై..కారణమేంటి?

    రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అడపాదడపా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నరు. రెండు రోజుల క్రితం ఉత్తరాఖాండ్ రాష్ట్రంలోని పాఠశాలల్లో సైతం కరోనా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలలకు పంపాలంటే భయపడుతున్నారు.

    Also Read: దుబ్బాక ఫలితం.. గ్రేటర్‌‌పై ప్రభావం

    మరోవైపు దేశంలో 40,000కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే పరిస్థితులు మారే అవకాశం ఉంది. వచ్చే సంవత్సరం జనవరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.