https://oktelugu.com/

Chiranjeevi : సందీప్ రెడ్డి వంగ తో అలాంటి సినిమా చేయాలనుంది అని మనుసులో మాట బయట పెట్టిన చిరంజీవి…

తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన హీరోల్లో చిరంజీవి ఒకరు. సీనియర్ ఎన్టీయార్ తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని భారీ సక్సెస్ లను సాధిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచితే ఆయన పరంపరను కొనసాగిస్తూ చిరంజీవి కూడా భారీ సక్సెస్ లను సాధించి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక స్థాయిలో నిలబెట్టడనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : December 15, 2024 / 01:25 PM IST

    Chiranjeevi-Sandeep Vanga Combination

    Follow us on

    Chiranjeevi :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న గుర్తింపు గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ 40 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ ని ఏకచిత్రాధిపత్యంతో ఏలుతున్న ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి… ఆయన చేస్తున్న వరుస సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయనకి ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ను కూడా పెంచుతున్నాయి. ఇక ఈ ఏజ్ లో కూడా ఆయన వరుస సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇప్పటికే ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధిస్తూ ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించి పెడుతున్నాయి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో సక్సెస్ ని అందుకున్న ఆయన ఆ తర్వాత చేసిన ‘సైరా’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఆయన 200 కోట్ల మార్కును చేరుకున్నాడు. ఇక ఇప్పుడు వశిష్ట డైరెక్షన్ లో చేస్తున్న ‘విశ్వంభర ‘ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించి పాన్ ఇండియాలో తన సత్తా ఏంటో చూపించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన యంగ్ డైరెక్టర్ల తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. విశ్వంభర తర్వాత అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమైన చిరంజీవి ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరొక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

    ఇక వీళ్లిద్దరితో పాటు బోల్డ్ సినిమా డైరెక్టర్ గా గుర్తింపుని సంపాదించిన సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయాలని ఉందని చిరంజీవి ఈమధ్య ఒక మాట అయితే చెప్పాడు. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్’ లాంటి ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలని ఉందని తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

    మరి సందీప్ రెడ్డి వంగ గ్యాంగ్ లీడర్ లాంటి కమర్షియల్ సినిమాలని చేయలేడు. ఆయన బోల్డ్ కంటెంట్ తో సినిమాలు చేస్తాడు. మరి చిరంజీవి కోసం తన మనసు మార్చుకొని గ్యాంగ్ లీడర్ లాంటి ఒక భారీ కమర్షియల్ సినిమాని చేస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

    నిజానికి సందీప్ రెడ్డి వంగ లాంటి కమర్షియల్ సినిమాలని హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉందా అనే ధోరణిలో కూడా కొంతమంది ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా లేదా అనే విషయం మీద ఇంకా సరైన క్లారిటీ అయితే లేదు. మరి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప ఈ విషయం మీద ఒక క్లారిటీ అయితే రాదు…