https://oktelugu.com/

Srikanth Odela : నానితో చేస్తున్న ప్యారడైజ్ సినిమా కోసం శ్రీకాంత్ ఓదెల ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడో తెలుసా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. ఇక ఏది ఏమైనా కూడా దర్శకులు అనేవాళ్లు ఎంత బాగా తీర్చిదిద్దితే ఆ సినిమా అంత సక్సెస్ ఫుల్ గా నిలుస్తుంది. లేకపోతే మాత్రం సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం అయితే ఉంది. తద్వారా సినిమాని ముందుకు తీసుకెళ్లే దర్శకుల కోసమే మన హీరోలు ఎదురు చూస్తున్నారు... ఇక అందులో భాగం గానే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్లు చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : December 15, 2024 / 02:20 PM IST

    Srikanth Odela

    Follow us on

    Srikanth Odela : కొంతమంది దర్శకులకు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అయితే వస్తుంది. ఇక అలాంటి కొవకు చెందిన వాడే శ్రీకాంత్ ఓదెల… నానితో చేసిన దసర సినిమాతో ఆయనకు మంచి విజయం దక్కడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నాని తనతో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ప్యారడైజ్ సినిమా భారీ విజయాన్ని సాధించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే శ్రీకాంత్ ఓదెల మొదటి సినిమా కోసం 20 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటే ఇప్పుడు ప్యారడైజ్ సినిమా కోసం దాదాపు 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన మార్కెట్ అనేది భారీగా పెరిగింది. తద్వారా ఆయన నుంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరించడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఆయన రెమ్యూనరేషన్ విషయం లో డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన సుధాకర్ చెరుకూరి కూడా శ్రీకాంత్ ఓదెల అడిగినంత డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఎందుకు అంటే సుధాకర్ చెరుకూరి చేసిన ఏ సినిమా కూడా ఇప్పటివరకు సక్సెస్ అయితే సాధించలేదు. అందులో సక్సెస్ అయిన ఒకే ఒక్క సినిమా దసర…

    అందువల్లే అతను శ్రీకాంత్ ను బాగా నమ్మాడు. తన బ్యానర్ లోనే సెకండ్ సినిమాని కూడా చేయించుకునేలా ప్రణాళికలు రూపొందించుకున్నాడు. తద్వారా ఆయన అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా తన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి శ్రీకాంత్ ఓదెల కూడా అదే బ్యానర్ లో స్టిక్ అయి ఉన్నాడని చాలామంది అభిప్రాయ పడుతున్నారు…

    ఇక ఏది ఏమైనా కూడా రెండో సినిమాతోనే 5 కోట్ల రెమ్యూనరేషన్ ని తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన తన తదుపరి సినిమాని చిరంజీవితో చేస్తున్నాడు. కాబట్టి ఆ సినిమా కోసం మరింత భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశం అయితే ఉంది.

    ఇక ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడమే తన ముందు ఉన్న బాధ్యతగా ఆయన భావిస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా కోసం ఆహార్నిశలు కష్టపడడానికి తను సిద్ధంగా ఉన్నట్టుగా తెలియజేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల తనకి వచ్చిన గుర్తింపును కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ముందుకు సాగుతున్నాడు…