Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో 40 సంవత్సరాల పాటు మకుటం లేని మహారాజుగా వెలుగొందిన మెగాస్టార్ చిరంజీవి గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీకి రాకముందు ఉన్న ఇండస్ట్రీ వేరేలా ఉండేది. ఆయన రాకతో ఇండస్ట్రీ ఎంతలా మారిపోయిందో మనందరికీ తెలిసిందే. ఆయన చేసిన సినిమాల మేకింగ్ పరంగా గాని, సినిమాల కథల పరంగా గాని ఇండస్ట్రీ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
అలాంటి చిరంజీవి ఇప్పటికీ కూడా యంగ్ హీరోలతో పాటు పోటీపడుతూ సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఉన్న స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమం లోనే ఒకానొక టైంలో చిరంజీవి మీద దుర్భాషలాడి ఆయనను తిట్టిన కొంతమంది రైటర్లు ప్రస్తుతం ఆయన చెంతకు చేరడం నిజంగా ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం అనే చెప్పాలి. ముందుగా యండమూరి వీరేంద్రనాథ్ గురించి చూసుకుంటే ఆయన కొద్ది సంవత్సరాల క్రితం రామ్ చరణ్ మీద కొన్ని బ్యాడ్ కామెంట్లు చేసిన విషయం మనకు తెలిసిందే. అయినప్పటికీ ఆయన్ని తన గొప్ప మనసుతో మళ్లీ తనతోపాటు కలుపుకొని తన బయోగ్రఫీ ని రాసే అవకాశాన్ని కూడా కల్పించాడు.
ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డు రావడంతో చిరంజీవి ఇంద్ర సినిమాకి స్టోరీ రైటర్ గా పనిచేసిన చిన్ని కృష్ణ కూడా చిరంజీవికి కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికి ఆయనను ప్రత్యక్షంగా కలిశాడు. ఇక ఆయన్ తో మాట్లాడి చిరంజీవి కి విషెస్ ని కూడా తెలియజేశాడు. అయితే ఒక రెండు సంవత్సరాల క్రితం చిన్నికృష్ణ చిరంజీవిని దుర్భాషలాడుతూ కించపరిచేలా మాట్లాడాడు. ఇక ఇప్పుడు చిన్ని కృష్ణ ఆ విషయం మీద స్పందిస్తూ చిరంజీవిని అప్పుడు అలా తిట్టడానికి కొంతమంది తనని ప్రేరేపించారని అందువల్లే తను అలా ప్రవర్తించడని చెప్పాడు.
కానీ ‘నిజంగా చిరంజీవి చాలా గొప్ప వ్యక్తి’ అంటూ చెబుతూనే ఇంతకుముందు తను చిరంజీవి మీద మాట్లాడిన ఆ మాటలకి కి తనని క్షమించమని కోరుతూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేశాడు.అలాగే చిరంజీవి మాత్రం తనకి విషెస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు తనని ఏ మాత్రం ద్వేశించకుండ చాలా గౌరవంగా రిసీవ్ చేసుకున్నాడని కూడా చిన్నికృష్ణ ఆ వీడియోలో తెలియజేయడం విశేషం. ఇలా చిరంజీవిని తిట్టిన ప్రతి ఒక్కరు ప్రస్తుతం చిరంజీవితో మళ్ళీ కలిసిపోతున్నారు… దీనివల్ల చిరంజీవి గొప్పతనం ఏంటి అనేది అందరికీ తెలుస్తుంది…