https://oktelugu.com/

Allu Arjun: నెక్స్ట్ సినిమా విషయంలో కన్ఫ్యూజన్ లో పడిన అల్లు అర్జున్…కారణం ఏంటంటే..?

అల్లు అర్జున్ మరొకసారి బోయపాటి తో సినిమా చేసి మాస్ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకుంటాడా లేదా తన కెరియర్ లో తనకి మూడు సక్సెస్ లు ఇచ్చిన త్రివిక్రమ్ కి కృతజ్ఞతగా ఆయనతో సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : February 5, 2024 / 10:27 AM IST
    Follow us on

    Allu Arjun: ఐకాన్ స్టార్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే తను నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఇంతకుముందు ఆయన త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాలని కమిట్ అయ్యాడు. కానీ త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమాతో భారీ ఫ్లాప్ ని అందుకున్నాడు.

    కాబట్టి ఇప్పుడు ఆయనతో సినిమా చేసే ఆలోచనలు అల్లు అర్జున్ లేనట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే క్రమం లో బోయపాటి కూడా అల్లు అర్జున్ కి ఒక మంచి కథ చెప్పి ఒప్పించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బోయపాటి శ్రీను సినిమా ఉంటుందని అల్లు అరవింద్ అఫిషియల్ గా అనౌన్స్ చేశాడు. ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో సరైనోడు అనే సినిమా వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించింది.

    ఇక ఇప్పుడు కూడా అల్లు అర్జున్ మరొకసారి బోయపాటి తో సినిమా చేసి మాస్ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకుంటాడా లేదా తన కెరియర్ లో తనకి మూడు సక్సెస్ లు ఇచ్చిన త్రివిక్రమ్ కి కృతజ్ఞతగా ఆయనతో సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయాలను తేల్చుకోలేకనే ప్రస్తుతం అల్లు అర్జున్ తల పట్టుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ లో బిజీగా గడుపుతున్న అల్లు అర్జున్ ఇంకొన్ని రోజుల్లో పుష్ప 2 సినిమా షూటింగ్ పూర్తి కాబోతుంది. కాబట్టి ఈ ఇద్దరి డైరెక్టర్లలో ఎవరికో ఒకరికి ఓకే చెప్పాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక సందీప్ రెడ్డి వంగ తో కూడా ఒక సినిమా కమిట్ అయినప్పటికీ, తను ప్రస్తుతం ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ గ్యాప్ లో వీళ్ళిద్దరిలో ఎవరితోనో ఒకరితో ఒక సినిమా చేయాలి. మరి ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ ని ఎంచుకుంటాడా? లేదా బోయపాటి శ్రీనుకి ఓటు వేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది…