https://oktelugu.com/

Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో దగ్గర ఉన్న కార్లు చూస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే..

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు క్రిస్టియానో రొనాల్డో వద్ద ఉన్నాయి. అతని వద్ద ఫెరారీ, బుగట్టి, లాంబోర్గిని, రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం క్రిస్టియానో రొనాల్డో వద్ద రెండు రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 5, 2024 / 10:52 AM IST
    Follow us on

    Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో..ఈ పోర్చు గల్ ఫుట్ బాల్ ఆటగాడి గురించి ప్రస్తావన వస్తే చాలు ప్రపంచం ఊగిపోతుంది. అతడు మైదానంలో అడుగుపెడితే కేరింతలు కొడుతుంది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను మాయ చేస్తూ గోల్స్ చేస్తే ప్రేక్షక లోకం ఫిదా అవుతుంది. అతడి ఆట తీరు.. లైఫ్ స్టైల్.. ఇంకా చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి కాబట్టి.. క్రిస్టియానో రొనాల్డో కు ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో అభిమానులు ఉన్నారు.. కేవలం పోర్చుగల్ అత్యుత్తమ ఆటగాడిగా మాత్రమే కాకుండా.. సౌదీ ప్రీమియర్ లీగ్ క్లబ్ లో “ఆల్ నాస్ర్” జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందుకు సౌదీ ప్రీమియర్ లీగ్ క్లబ్ అతడికి కోట్లల్లో ఫీజు చెల్లిస్తోంది. అక్కడ ఫుట్ బాల్ మ్యాచ్ లు ఆడినన్ని రోజులు ఉండడానికి విలాసవంతమైన భవనాన్ని అతనికి కేటాయించింది. ప్రత్యేకమైన విమానం, కోచ్, డైటీషియన్, జిమ్.. ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని అత్యంత ఆధునికమైన సౌకర్యాలను సౌదీ ప్రీమియర్ లీగ్ జట్టు అతనికి కల్పించింది. ఫిబ్రవరి 5న క్రిస్టియానో రొనాల్డో తన 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా క్రిస్టియానో రొనాల్డో వద్ద ఉన్న కార్ల కలెక్షన్ గురించి ఒక లుక్కేద్దామా..

    ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు క్రిస్టియానో రొనాల్డో వద్ద ఉన్నాయి. అతని వద్ద ఫెరారీ, బుగట్టి, లాంబోర్గిని, రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం క్రిస్టియానో రొనాల్డో వద్ద రెండు రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. ఇందులో ఒక కారు విలువ దాదాపు 7 కోట్లు. క్రిస్టియానో రొనాల్డో సామాజిక మాధ్యమాలలో చాలా చురుకుగా ఉంటాడు. తన వద్ద ఉన్న ఫెరారీ కారుతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కోట్లల్లో లైక్స్ వచ్చాయి. ఇక
    క్రిస్టియానో రొనాల్డో నాలుగు ఫెరారీ కార్లు ఉన్నాయి..ఇందులో ఎఫ్ 12 టీడీఎఫ్ అత్యంత ఖరీదైనది. దీని ధర దాదాపు 5 కోట్లు.

    క్రిస్టియానో రొనాల్డో 3 బుగట్టి కార్లు ఉన్నాయి. బుగట్టి సెంటోడేసి కారు ధర దాదాపు 65 కోట్లు, బుగట్టి చిరోన్ ధర 20 కోట్లు. ఇవి మాత్రమే కాకుండా ఇంకా చాలా ఖరీదైన కార్లు క్రిస్టియానో రొనాల్డో వద్ద ఉన్నాయి. పోర్బ్స్ జాబితా ప్రకారం ఏప్రిల్ 2022 నాటికి క్రిస్టియానో రొనాల్డో నికర ఆస్తుల విలువ 849 మిలియన్ డాలర్లు. అతడికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. సోషల్ మీడియాలో అతడిని కోట్ల మంది అనుసరిస్తున్నారు. క్రిస్టియానో రొనాల్డో తన కెరియర్లో 800 కు పైగా గోల్డ్ సాధించాడు. పోర్చుగల్ దేశంతో పాటు చాలా క్లబ్ లలో అతడు ఆడాడు. సోమవారం 39వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అతనికి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. సామాజిక మాధ్యమాలలో అతడు ప్రస్తుతం ట్రెండింగ్ టాపిక్ గా ఉన్నాడంటే అతడి ఫాలోయింగ్ అర్థం చేసుకోవచ్చు.