Chinna Movie Review: ఎమోషనల్ సినిమాలు తీయాలంటే కాస్త ధైర్యం కావాలి. ఎందుకంటే ప్రేక్షకులు సాధారణంగా ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు. కానీ మంచి కాన్సెప్ట్ ఉంటే మాత్రం సినిమాను సక్సెస్ వరకు తీసుకెళ్తారు. ఇదివరకు చాలా మంది డైరెక్టర్లు ఎమోషనల్ సినిమాలు తీసి కొందరు ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యారు. మరికొందరు బోల్తా పడ్డారు.ఇలాంటి సమయంలో హీరో సిద్ధార్థ్ తాను నటిస్తూ స్వయంగా ఓసినిమాను నిర్మించాడు. దాని పేరే ‘చిన్నా’. తమిళంలో ఇప్పటికే ‘చింత’ పేరుతో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో ఎలాంటి రిజల్ట్ వస్తుందోనని ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా గురించి వివరాల్లోకి వెళితే..
నటీనటులు:
సిద్దార్థ్,
సహస్ర శ్రీ,
నిమిషా సజయన్,
అంజలి నాయర్
సాంకేతిక వర్గం:
డైరెక్టర్: ఎస్ యూ అరుణ్ కుమార్
నిర్మాత: సిద్ధార్థ
మ్యూజిక్: విశాల్ చంద్ర శేఖర్, దిబు నినన్ థామస్
సినిమాటోగ్రఫీ: బాలాజీ సుబ్రహ్మణ్యం
కథ:
తల్లిదండ్రులు చిన్నప్పుడే కోల్పోవడంతో ఈశ్వర్(సిద్ధార్థ్) తన అన్న వదినలతో జీవిస్తుంటాడు. తన అన్నకూడా మరణించడంతో ఆ కటుంబం బాధ్యత తనపైనే వేసుకొని వదిన (అంజలి నాయర్), ఆమె కూతురు (సహస్ర శ్రీ)లతో కలిసి జీవిస్తాడు. ఈ తరుణంలో ఈశ్వర్ తన అన్నకూతురును కంటికి రెప్పలా చూసుకుంటాడు. శక్తి (నిమిా సజయన్) అనే అమ్మాయి ప్రేమలో పడి ఆనందంగా జీవిస్తాడు. అయితే అప్పటికే చిన్నారులపై అరాజ్ మెంట్ జరుగుతున్న కథనాలు విని చలించిపోతాడు. కానీ ఓసారి ఈశ్వర్ పై చిన్న అమ్మాయిని వేధించాడు అనే నింద పడుతుంది. దీంతో అతనిని జైలుకు పంపిస్తారు. ఇదే సమయంలో తన అన్న కూతురు సహస్ర శ్రీ ని కొందరు కిడ్నాప్ చేస్తారు. ఆ తరువాత ఏం జరిగిందనేది తెరపై చూడాల్సిందే.
కథనం:
చిన్నపిల్లలపై జరిగే అఘాయిత్యాలను చూపించడం అనేది కొత్త కాన్సెప్ట్ . కానీ పూర్తిగా ఎమోషనల్ లోకి ప్రేక్షకులను తీసుకెళ్లడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ సమాజంలో పరిస్థితులు ఎలా ఉన్నాయోనని సినిమా ద్వారా చూపించడం ప్రశంసనీయం. ఎక్కడా అసభ్యతకు తావు లేకుండా, ఓ మంచి విషయాన్ని నేరుగా చెప్పేవారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ సినిమా చూసి జాగ్రత్తపడాలి అని చెప్పినట్లు అర్థమవుతుంది. మొత్తంగా సినిమా స్లో రన్ అయినా కాస్త ఫీల్ తెప్పిస్తుది.
ఎవరెలా చేశారంటే?
చాలా రోజుల తరువాత సిద్ధార్థ్ ఎమోషనల్ సినిమా చేసి మరోసారి బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నాడు. లవర్ బాయ్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన మధ్యలో కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఒక మంచి సినిమాకు నిర్మాతగా ఉంటూ నటించడం అభినందనీయమని కొనియాడుతున్నారు. 8 ఏళ్ల చిన్నారి పాత్రలో సహస్ర శ్రీ అద్భుతంగా నటించింది. సమాజంలో ఒక అమ్మాయికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయనేది తను నటించి కనిపించడం ఆకట్టుకుంటుంది. మిగతా వారు ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పనితీరు:
డైరెక్టర్ కొత్త కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడు. దీనిని తీయడంలోనూ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఇలాంటి జుగుప్సా కర పరిస్థితులను తెరపై చూపించాలంటే కాస్త ధైర్యం చేయాలి. కానీ ఎస్ యూ అరుణ్ కుమార్ తను అనుకున్న విషయాన్ని నేరుగా చూపించి సక్సెస్ అయ్యాడని తెలుస్తోంది. సినిమా నిర్మాణ విలువలు ఎక్కడా తగ్గకుండా ఉన్నాయి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ పీపుల్స్ లా చూపించడం ఆకట్టుకుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు అనుగుణంగా లేదని చెప్పాలి. అయితే సినిమాటోగ్రఫీ మాత్రం మరో ఎస్పెట్ అని చెప్పొచ్చు.
ముగింపు: ఇలాంటి సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ కాస్త క్యారెక్టర్స్ ను ఎలివేట్ చేయడంలో మరింత పనితీరును మెరుగుపర్చాల్సి ఉండేది.
రేటింగ్:
5/2.75