Anasuya Bharadwaj: జబర్దస్త్ ఒక లెజెండరీ కామెడీ షో అనడంలో ఎలాంటి సందేహం లేదు. 2013లో ప్రయోగాత్మకంగా మొదలైన జబర్దస్త్ బుల్లితెరపై సంచనాలు చేసింది. ఈ షో వేదికగా అనసూయ స్టార్ అయ్యారు. అప్పటి వరకు అనసూయ కనీసం ఎవరో కూడా తెలియదు. పొట్టిబట్టల్లో యాంకర్స్ ని చూడటం కూడా తెలుగు ప్రేక్షకులకు కొత్త. జబర్దస్త్ మొదలైన కొన్నాళ్ళకు అనసూయ వ్యక్తిగత కారణాలతో తప్పుకుంది. దాంతో రష్మీ గౌతమ్ ఎంటర్ అయ్యింది. ఆమెకు అదృష్టం కలిసొచ్చింది.
షో ట్రెమండస్ సక్సెస్ కావడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ అంటూ మరో షో స్టార్ట్ చేశారు. అలా అనసూయ రీఎంట్రీ ఇచ్చింది. 2022 వరకు అనసూయ ప్రస్థానం కొనసాగింది. గత ఏడాది అనసూయ జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేశారు. అనసూయ కంటే ముందు నాగబాబు, రోజా వంటి స్టార్స్ ఆ షోకి దూరమయ్యారు.
ఒకప్పటి స్టార్ కమెడియన్స్ కూడా షోలో లేరు. దీంతో జబర్దస్త్ మునుపటి కళ కోల్పోయింది. అయితే అనసూయ జబర్దస్త్ ఎందుకు మానేశారు? అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. తాజాగా ఆమె ఈ విషయంపై స్పందించారు. జబర్దస్త్ మానేయడానికి మొదటి కారణం నన్ను అందరూ యాంకర్ గానే చూస్తున్నారు. నటిగా చూడటం లేదు. జబర్దస్త్ షోలో నవ్విస్తున్నాను. సినిమాల్లో సీరియస్ రోల్స్ చేస్తున్నాను. దీని వలన ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందుకే జబర్దస్త్ కి దూరమయ్యానని అనసూయ వివరణ ఇచ్చింది.
అయితే తనకు జీవితం ఇచ్చింది మాత్రం జబర్దస్త్, అది ఎప్పటికీ నా ఫేవరెట్ షో అని చెప్పింది. కాగా గతంలో అనసూయ వేరే కారణాలు చెప్పారు. బుల్లితెర షోలలో టీఆర్పీ కోసం చెత్త స్టంట్స్ ఎక్కువైపోయాయి. అవి నచ్చక యాంకరింగ్ మానేశాను. అలాంటి వాతావరణం లేని రోజు మరలా యాంకరింగ్ చేస్తానని ఆమె సోషల్ మీడియా చాట్ లో అన్నారు. అలాగే జబర్దస్త్ కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారని ఆరోపణలు చేయడం విశేషం…