Chinmayi: నటుడు శివాజీ రీసెంట్ గా దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా హీరోయిన్లను ఉద్దేశించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అతని మీద చాలా మంది సినిమా సెలబ్రిటీలు సైతం విమర్శలను కురిపించారు. నిజానికి ఆయన మాట్లాడిన దాంట్లో పెద్దగా తప్పయితే ఏమీ లేదంటూ చాలామంది ప్రేక్షకులు అతనికి సపోర్ట్ చేస్తున్నారు. కానీ అనసూయ, చిన్మయి లాంటి వారు మాత్రం శివాజీ మీద విషం కక్కుతూనే ఉన్నారు. ఎందుకని ఇలా చేస్తున్నారు అనేది ఎవ్వరికి తెలియడం లేదు. ఇక ఇదంతా చూస్తుంటే కావాలని ఒక ప్రణాళిక ప్రకారం ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టకుండా వాళ్లు ముందుకు లాగుతున్నారు అంటూ చాలామంది ఈ విషయం మీద స్పందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ భాష రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు హీరోయిన్ల డ్రెస్ ల మీద శివాజీ కామెంట్లు చేస్తే చిన్మయి లాంటి వారు ఆయన మాటలను తప్పుబట్టారు. కానీ చిన్మయి మాత్రం రోబో సినిమాలో ‘కిలిమంజారో’ అనే సాంగ్లో కొన్ని బూతు పదాలు ఉన్నప్పటికి ఆ పాటనైతే పాడారు. దీనివల్ల ఆమె సమాజానికి ఏం చెప్పాలనుకున్నారు. అంతే డబ్బులు ఇస్తే ఎద్దన చేయడానికి రెడీ గా ఉంటారా? అంటూ ఆయన ఒక క్వశ్చన్ అయితే అడిగాడు.
దాని మీద రీసెంట్ గా చిన్మయి స్పందిస్తూ కిలిమంజారో పాటను తమిళంలో పాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది చూసినా చాలా మంది అదేంటి చిన్మయి మేము నీకు సపోర్ట్ చేస్తూ ఇక్కడ కొట్టుకొని చస్తుంటే నువ్వేమో తీరిగ్గా పాటలు పాడుతున్నావు అంటూ కామెంట్ చేశారు.
దానికి రెస్పాండ్ అయిన చిన్మయి ఎవడి ఇష్టం వాడిది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోండి…ఎవడి చావు వాడు చస్తాడు అంటూ రెస్పాన్సిబిలిటీ లేనట్టుగా సమాధానం చెప్పింది. దీని మీద చాలామంది జనాలు ఫైర్ అవుతున్నారు… శివాజీ మాట్లాడిన మాటల్లో తప్పు పదాలు ఉండొచ్చు కానీ ఆయన మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉంది.
హీరోయిన్లు ఇష్టం వచ్చినట్టుగా డ్రెస్సులు వేసుకొని తిరగడం వల్ల సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలా మందికి హీరోయిన్లు లోకువగా కనిపిస్తున్నారు అంటూ ఆయన మాట్లాడాడు… ఆయన మాటల్లో 100% వాస్తవం ఉంది అంటూ చాలామంది అతన్ని సపోర్ట్ చేస్తున్నారు. కానీ అనసూయ, చిన్మయి లాంటి వారు మాత్రం కావాలనే అతనిని వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ వివాదం ఇప్పటితో సద్దుమణుకుతుందా? లేదంటే ఇంకా ముందుకు వెళ్తుందా అనేది తెలియాల్సి ఉంది…