Shreyas Iyer: ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన వన్డే సిరీస్ లో ఆడాడు శ్రేయస్ అయ్యర్. ఆ మ్యాచ్లో ఆడుతూ అతడు గాయపడ్డాడు. కొద్దిరోజుల పాటు ఆస్ట్రేలియాలోనే చికిత్స పొందాడు. కొంతకాలంగా అతడు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సులో చికిత్స పొందుతున్నాడు.. అతనికి సంబంధించి ఓ వార్త మీడియాలో ప్రసారమవుతోంది.
గాయం వల్ల చికిత్స పొందిన అయ్యర్ కు బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు నుంచి ఇంకా అనుమతి రాలేదు. దీంతో అతడిని న్యూజిలాండ్ జట్టు సిరీస్ కు ఎంపిక చేసే అవకాశం లేదని తెలుస్తోంది. జనవరి 3న న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ కోసం టీమ్ ఇండియాను ఎంపిక చేస్తారు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా, బుమ్రా కు వర్క్ లోడ్ పేరుతో విశ్రాంతి ఇచ్చినట్టు తెలుస్తోంది. తిలక్ వర్మను కూడా టి20 వరల్డ్ కప్ కోసం పక్కన పెట్టారని సమాచారం. ఇంకా ఇద్దరు ప్లేయర్లు కూడా ఇదే జాబితాలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే అయ్యర్ కు కూడా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సు నుంచి అనుమతి రాకపోవడంతో, అతడు కూడా న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్లో కనిపించకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
షెడ్యూల్ ప్రకారం అయ్యర్ డిసెంబర్ 30న బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి బయటికి రావాలి. ఇప్పుడు అతడు మరో వారం పాటు అక్కడ ఉండాల్సి ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండానే అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే కడుపులో గాయం కావడంతో చాలా వరకు అతడు బరువు తగ్గిపోయాడు. అతడి సామర్థ్యం కూడా ఒకప్పటి మాదిరిగా లేదు. మరో వారం పాటు అతడు సామర్థ్యం, బరువు పెంచుకోవడం వంటి అంశాల మీదనే దృష్టి సారిస్తాడని తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పర్యటనలో అయ్యర్ గాయపడ్డాడు. గడిచిన రెండు నెలలుగా అతడు క్రికెట్ కు దూరమయ్యాడు. గాయం వల్ల అతడు దాదాపు 6 కిలోల వరకు బరువు తగ్గిపోయాడు. దీంతో సామర్థ్యాన్ని కూడా ఒకప్పటి మాదిరిగా పెంపొందించుకోలేకపోయాడు. అందువల్లే అతడిని మరో వారం పాటు బీసీసీఐ సీఈవోలో ఉంచుతారని తెలుస్తోంది. ఐపీఎల్ లో పంజాబ్ జట్టుకు నాయకత్వం వహించిన అయ్యర్.. ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. అయితే అతడికి జాతీయ జట్టులో అవకాశాలు లభించకుండా గంభీర్ కుట్రలు చేస్తున్నాడని అభిమానులు వాపోతున్నారు.