Childhood Photo: యాడ్స్ చేస్తున్న క్రమంలోనే హీరోయిన్స్ గా మారి సక్సెస్ సాధించిన వాళ్లు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ప్రస్తుతం ఫోటోలో వైరల్ అవుతున్న ఈ బ్యూటీ కూడా కెరియర్ స్టార్టింగ్ లో రస్నా యాడ్లో నటించింది. ప్రస్తుతం ఈమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. చాలామంది హీరోయిన్లు కెరియర్ స్టార్టింగ్ లో సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి ఆ తర్వాత హీరోయిన్స్కు కూడా సక్సెస్ సాధించారు. అలాగే మరి కొంతమంది కెరియర్ బిగినింగ్లో యాడ్స్లలో కనిపించి ఆ తర్వాత హీరోయిన్స్ గా కూడా రాణించారు. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న యాడ్స్ లలో యాడ్ కూడా ఒకటి రస్నా యాడ్ కూడా ఒకటి. సమ్మర్ రాబోతుందంటే చాలు ఈ యాడ్ బుల్లితెర మీద టీవీలలో బాగా సందడి చేస్తుంది. అయితే ఈ యాడ్ లో నటించిన చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ అని మీకు తెలుసా.. ఈ హీరోయిన్ నందమూరి హీరోలతో ఆడి పాడింది. తన అంద చందాలతో కుర్రాళ్లను కట్టిపడుతుంది. అయితే రస్నా యాడ్లో కనిపించిన చిన్నారి మరెవరో కాదు టాలీవుడ్ హీరోయిన్ అంకిత. అయితే రస్నా యాడ్ లో కనిపించిన చిన్నారి టాలీవుడ్ హీరోయిన్ అంకిత అని చాలామందికి తెలిసి ఉండదు. అంకిత అంటే తెలుగు ప్రేక్షకులు అంతగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ సింహాద్రి సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన హీరోయిన్ అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు.
Also Read: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి 2 ఏళ్ల జైలు శిక్ష..? కారణం ఏమిటంటే!
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన సింహాద్రి సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా ఇద్దరు హీరోయిన్ల నటించారు. భూమిక, అంకిత ఈ సినిమాలో హీరోయిన్లుగా కనిపించారు. అంకిత తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా అంకిత తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. రస్నా యాడ్ లో కనిపించిన ఈ చిన్నారి ఆ తర్వాత రస్నా బేబీ గా గుర్తింపు తెచ్చుకుంది. లాహిరి లాహిరి లాహిరిలో అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయం అయింది. మొదటి సినిమాతోనే తన అందంతో, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత అంకిత సింహాద్రి, విజయేంద్ర వర్మ, సీతారాముడు, అనసూయ, వినాయకుడు అనే సినిమాలలో నటించింది. కానీ ఎవరు ఊహించని విధంగా సినిమాలకు దూరం అయింది. చాలామంది అంకిత అభిమానులు ప్రస్తుతం ఆమె ఎలా ఉంది, ఏం చేస్తుంది అంటే గూగుల్లో గాలిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అంకిత అంతగా యాక్టివ్ గా ఉండదు. గూగుల్ లో కూడా ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు తక్కువగానే దొరుకుతాయి.