Sreeleela: శ్రీ లీల తన అందంతో, నటనతో అలాగే డాన్స్ తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆ తర్వాత ఈ అమ్మడు సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా గుంటూరు కారం సినిమాలో ఆడి పాడింది.శ్రీ లీల అలా బాలీవుడ్ కు వెళ్లిందో లేదో ఆమెపై కూడా గాసిప్లు మొదలయ్యాయి. ముంబై అంటేనే రూమర్స్ లకు కేరాఫ్ అడ్రస్. శ్రీ లీల కూడా ఇందుకు మినహాయింపు కాదు అని తెలుస్తుంది. అయితే ఆ బాలీవుడ్ హీరో తో శ్రీ లీల డేటింగ్ చేస్తుందంటూ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె అభిమానులు కూడా శ్రీ లీల ను చూసి ఇప్పుడు ఇదే అడుగుతున్నారు. బాలీవుడ్ వెళ్ళగానే ఏమైంది.. ఆ రూమర్స్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగు ఇండస్ట్రీలో రెండేళ్లు వరసగా సినిమాలు చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక రూమర్ కూడా రాలేదు. కానీ ఆమె అలా ముంబై వెళ్ళిందో లేదో ఆమెపై రూమర్ మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో హీరో నితిన్ తో రాబిన్ హుడ్ అలాగే రవితేజ మాస్ జాతర సినిమాలలో బిజీగా ఉంది. అలాగే తమిళ్లో శివ కార్తికేయన్ తో పరాశక్తి సినిమాలో నటిస్తుంది. ఈ మధ్యకాలంలోనే ఈమె కార్తీక్ ఆర్యన్ తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాతోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ బ్యూటీ.
Also Read: రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కి 2 ఏళ్ల జైలు శిక్ష..? కారణం ఏమిటంటే!
డెబ్యూ సినిమా హీరోతోనే ఈ ముద్దుగుమ్మ డేటింగ్ లో ఉన్నట్లు ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఐఫా వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ అడిగిన ఒక ప్రశ్నతో ఇదంతా మొదలైనట్లు తెలుస్తుంది. మీకు కాబోయే కోడలు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు అంటూ నిర్మాత కరణ్ జోహార్ హీరో కార్తీక్ ఆర్యన్ తల్లిని అడిగారు. అప్పుడు ఆమె డాక్టర్ అయితే బాగుంటుంది అంటూ సమాధానం ఇచ్చారు. కార్తీక్ ఆర్యన్ తల్లి చెప్పిన ఆ ఒక్క మాటతో కార్తీక్ ఆర్యన్, శ్రీ లీల మధ్య ఏదో ఉంది అంటూ బాలీవుడ్లో కథనాలు వినిపించాయి.
శ్రీ లీల కూడా డాక్టర్ కం యాక్టర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. దాంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ డౌట్స్ అన్నీ కూడా అప్పుడే అక్కడే ఆ హీరో తీర్చేశారు. తన ఇంట్లో వాళ్ళు కోరుకునేది హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ అని అంతేకానీ సినిమాలలో నటించే డాక్టర్ కాదంటూ క్లారిటీ ఇచ్చారు హీరో కార్తీక్. దాంతో ఆ రూమర్లకు ఫుల్ స్టాప్ పడింది.