Chikiri Chikiri fever: రామ్ చరణ్(Global Star Ram Charan) ఫ్యాన్స్ మొత్తం ఇప్పుడు ‘పెద్ది'(Peddi Movie) చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ భారీ రేంజ్ లో కం బ్యాక్ ఇవ్వబోతున్నాడని అభిమానులు చాలా బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి వచ్చిన గ్లింప్స్ వీడియో మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘చికిరి..చికిరి’ పాట అయితే సెన్సేషనల్ హిట్ అయ్యింది. యూట్యూబ్ లో రోజుకి 40 లక్షల వ్యూస్ పైగా సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ పాటకు కేవలం తెలుగు వెర్షన్ నుండి 43 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ వీకెండ్ తో కచ్చితంగా 50 మిలియన్ వ్యూస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇన్ స్టాగ్రామ్ లోని యూజర్లు ఈ పాట లోని రామ్ చరణ్ స్టెప్పులను అనుకరిస్తూ చేస్తున్న రీల్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇన్ స్టాగ్రామ్ తెరిస్తే చాలు చికిరి..చికిరి రీల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. వివిధ వయస్సులకు సంబంధించిన వాళ్ళు వచ్చీ రాని స్టెప్పులతో, విచిత్రం గా వాళ్ళు వేసే డ్యాన్స్ చూస్తే, ఇదేమి కర్మ రా బాబు అని అనిపించక తప్పదు. కొన్ని రీల్స్ ని చూసి అన్నం కూడా తినలేము అనుకోండి, అంత దారుణంగా ఉన్నాయి. అదే సమయం లో ఫన్నీ గా కూడా ఉన్నాయి. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, హిందీ ఆడియన్స్ కూడా రీల్స్ ఒక రేంజ్ లో చేస్తున్నారు. ముంబై కి చెందిన ఒక పోలీస్ అధికారి చికిరి పాటకు స్టెప్పులేస్తున్న రీల్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఇండియా లోనే కాదు,నేపాల్ మరియు ఇతర దేశాలకు చెందిన మూవీ లవర్స్ కూడా ఈ పాటకు స్టెప్పులేస్తూ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ ని అప్లోడ్ చేస్తున్నారు.
సోషల్ మీడియా లో నవ్వు రప్పించే రీల్స్ అన్ని మిక్స్ చేసి మీకోసం క్రింద ఒక వీడియో ని షేర్ చేస్తున్నాం చూడండి. దీనిపై మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఆడవాళ్లు, మగవాళ్ళు, చిన్నా, పెద్దా అని తేడా లేదు, ప్రతీ ఒకరు చికిరి పాటకు స్టెప్పులు వేసేందుకు తహతహలాడుతున్నారు. ఈ మేనియా ఎప్పటి వరకు ఇన్ స్టాగ్రామ్ లో కొనసాగుతుందో చూడాలి. రంగస్థలం తర్వాత సోలో హీరో గా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న రామ్ చరణ్ కి ఈ సినిమా ద్వారా మంచి బ్రేక్ దొరుకుతుందని ఈ చికిరి పాట రీచ్ చూసిన తర్వాత అభిమానుల్లో చిన్నపాటి నమ్మకం కలిగింది. మరి మేకర్స్ ఆ నమ్మకాన్ని ఎంత వరకు నిలబెట్టుకుంటారో చూడాలి. వచ్చే నెల ఈ సినిమా నుండి రెండవ పాట ని విడుదల చేయబోతున్నారట. ఈ పాటలో కూడా డ్యాన్స్ బాగుంటుందని అంటున్నారు.
#ChikiriChikiri fever #Peddi pic.twitter.com/uVgJJAuw37
— (@dharmat99) November 11, 2025