Megastar in Lokah sequel: ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రాల్లో ఒకటి ‘లోక'(Lokah Movie). కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ప్రధాన పాత్రలో నటించిన ఈ మలయాళం సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. తెలుగు లో కూడా ఈ చిత్రం ‘కొత్త లోక’ అనే పేరుతో ప్రముఖ నిర్మాత నాగవంశీ దబ్ చేసి విడుదల చేసాడు. ఇక్కడి ఆడియన్స్ కి కూడా ఈ చిత్రం బాగా నచ్చడం తో 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు కేవలం తెలుగు వెర్షన్ నుండి వచ్చాయి. రీసెంట్ గానే జియో హాట్ స్టార్ లోకి అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాని ఓటీటీ ఆడియన్స్ కూడా తెగ ఇష్టపడుతున్నారు. విడుదలైన రోజు నుండి నేటి వరకు నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతూనే ఉంది ఈ చిత్రం.
ఇదంతా పక్కన పెడితే త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ కూడా రానుంది. ఈ సీక్వెల్ లో కళ్యాణి ప్రియదర్శన్ తో పాటు దుల్కర్ సల్మాన్, తొనివో థామస్ కూడా కనిపించనున్నారు. అయితే ఈ చిత్రం లో మలయాళం మెగాస్టార్ మమ్మూటీ కూడా ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడని తెలుస్తోంది. ఈ విషయాన్నీ స్వయంగా ఆయన తనయుడు దుల్కర్ సల్మాన్ తెలిపాడు. ‘మా నాన్న గారు కూడా ఈ సీక్వెల్ లో భాగం కానున్నాడు. ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం అనే చెప్పాలి. ఇప్పుడు మా నాన్న గారు ఉన్నారు కాబట్టి, ఆయనతో పోటీ పడి నటించాల్సి ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. లోక మొదటి భాగానికి నిర్మాత దుల్కర్ సల్మాన్ అనే విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. తక్కువ బడ్జెట్ తో సినిమాని పూర్తి చేసి 300 కోట్ల రూపాయిలను కొల్లగొట్టాడు. కానీ సీక్వెల్ ని మాత్రం భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తాడట. ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడా కూడా తగ్గకుండా ఉండేలా చూసుకుంటాడట. చూడాలి మరి ఈ సీక్వెల్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని వండర్స్ క్రియేట్ చేయబోతుంది అనేది.