Chhaava Movie Telugu Collections
Chhaava Movie : నార్త్ ఇండియా లో ప్రభంజనం సృష్టించిన ‘చావా'(Chaava Movie) చిత్రం 400 కోట్ల రూపాయిల ప్రతిష్టాత్మక బెంచ్ మార్క్ ని అధిగమించి 500 కోట్ల రూపాయిల వైపు పరుగులు తీస్తున్న సంగతి తెలిసిందే. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ని, ఆయన త్యాగాన్ని వెండితెర మీద అద్భుతంగా చూపించినందుకు నార్త్ ఇండియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పెట్టేసారు. మన తెలుగు ఆడియన్స్ కి మొదటి నుండి మన చారిత్రక నేపథ్యం లో వచ్చే సినిమాలంటే అమితాసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ చిత్రం అక్కడి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నప్పటి నుండి ప్రేక్షకులు తెలుగు లో డబ్ చేయమని ఆ చిత్ర నిర్మాతలను ట్యాగ్ చేసి పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేసారు. తెలుగు ఆడియన్స్ లో ఉన్న డిమాండ్ ని బాగా గమనించిన అల్లు అరవింద్(Allu Aravind), వెంటనే తెలుగు డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేసేసాడు.
మార్చి 7న ‘చావా’ తెలుగు వెర్షన్ థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. తెలుగు వెర్షన్ కి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ కూడా భారీగానే అమ్ముడుపోయింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 8 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ కి కలిపి పది కోట్ల రూపాయలకు జరిగినట్టు సమాచారం. విక్కీ కౌశల్(Vicky Kaushal) అంటే ఎవరో మన తెలుగు ఆడియన్స్ కి పెద్దగా తెలియకపోయిన ఈ రేంజ్ లో అమ్ముడుపోయిందంటే సాధారమైన విషయం కాదు. ఇలాంటి సినిమాలకు తెలంగాణ ప్రాంతంలో భారీ వసూళ్లు వస్తుంటాయి. హైదరాబాద్, నార్త్ తెలంగాణ లో ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ ఊహించని రేంజ్ లో ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం నైజాం ప్రాంతం నుండి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
Also Read : చావా’ చిత్రంలో హీరోయిన్ రోల్ ని మిస్ చేసుకున్న ఫ్లాప్ హీరోయిన్ ఆమేనా..? చేసుంటే జీవితమే మారిపోయేది!
అదే విధంగా బెంగళూరు, వైజాగ్, కర్నూల్, విజయవాడ వంటి ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకి భారీ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిర్మాత అల్లు అరవింద్ రీసెంట్ గానే ‘తండేల్'(Thandel Movie) మూవీ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఖాతాలోకి ‘చావా’ మూవీ రాబోతుంది. ఈ సినిమా కి మన ఆడియన్స్ కనెక్ట్ అయితే గీత ఆర్ట్స్ మరోసారి కుంభస్థలాన్ని బద్దలు కొట్టినట్టే. ఈ సినిమా ప్రొమోషన్స్ కి హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ రష్మిక, డైరెక్టర్ లక్ష్మణ్ పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. త్వరలోనే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఈ సినిమా విశేషాల గురించి మాట్లాడబోతున్నారు మేకర్స్. చూడాలి మరి ఈ చిత్రం మన తెలుగు ఆడియన్స్ ని ఎంత వరకు అలరిస్తుంది అనేది. కచ్చితంగా క్లైమాక్స్ మనోళ్లకు ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుంది అనుకోవచ్చు.