https://oktelugu.com/

Champions Trophy : ఇంగ్లాండ్ మీదే.. ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ ఆశలు.. గణాంకాలు ఎలా ఉన్నాయంటే..

Champions Trophy  : ఛాంపియన్స్ ట్రోఫీ (champions trophy) తుది దశకు చేరుకుంది. ఈ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ జట్లు గ్రూప్ - ఏ లో సెమీస్ వెళ్లిపోయాయి. ఇంగ్లాండ్ జట్టుతో బుధవారం జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచిన నేపథ్యంలో..గ్రూప్ - బీ లో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఈ గ్రూపులో ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ చెరో విజయం సాధించాయి.. దీంతో ఏ జట్లు సెమీస్ వెళ్తాయనేది ఉత్కంఠ గా మారింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 27, 2025 / 08:23 PM IST
    Champions Trophy Semi Finals

    Champions Trophy Semi Finals

    Follow us on

    Champions Trophy  : గ్రూప్ – ఏ లో భారత్, న్యూజిలాండ్ సెమీఫైనల్ వెళ్ళాయి. నెట్ రన్ రేట్ ఆధారంగా న్యూజిలాండ్ గ్రూప్ – ఏ లో మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో భారత్ ఉంది. మార్చి 2న ఇండియా, న్యూజిలాండ్ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు గ్రూప్ – ఏ లో అగ్రస్థానంలో ఉంటుంది.. ఇక ఇంగ్లాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ గెలిచిన నేపథ్యంలో గ్రూప్ – బీ లో సెమీఫైనల్ ఏ జట్టు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై ఆఫ్ఘనిస్తాన్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.. ఇక ఈ టోర్నీలో రెండు మ్యాచ్లలో ఒక దాంట్లో విజయం సాధించిన నేపథ్యంలో.. పాయింట్ల పట్టికలో ఆఫ్ఘనిస్తాన్ మూడో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ జట్టు రెండు మ్యాచ్లు ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ వెళ్లాలంటే శుక్రవారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగే మ్యాచ్లో విజయం సాధించాలి. ఈ విజయం సాధించినప్పటికీ ఆఫ్గనిస్తాన్ సెమీఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉండదు.. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ మధ్య శనివారం జరిగే మ్యాచ్లో ఇంగ్లాండ్ కనక విజయం సాధిస్తే.. ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ వెళ్తుంది. గ్రూప్ – బీ లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా పాయింట్లు పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. శుక్రవారం జరిగే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ పై విజయం సాధిస్తే ఆస్ట్రేలియా సెమీస్ వెళ్తుంది. అప్పుడు ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను నష్టపోతుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడే మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధిస్తే దక్షిణాఫ్రికా సెమీస్ వెళ్తుంది. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై ఆస్ట్రేలియా కనుక ఓడిపోతే.. ఇంగ్లాండ్ పై దక్షిణాఫ్రికా గనుక ఓడిపోతే.. రన్ రేట్ ఆధారంగా సౌత్ ఆఫ్రికా సెమిస్ వెళ్తుంది. అప్పుడు గ్రూప్ బి నుంచి ఆఫ్ఘనిస్తాన్, దక్షిణాఫ్రికా సెమిస్ వెళ్ళిపోతాయి. టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ ఓడించిన నేపథ్యంలో.. శుక్రవారం జరిగే మ్యాచ్లో ఆస్ట్రేలియా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మొదటికే మోసం వస్తుంది. అందువల్లే ఆ జట్టు పకడ్బందీగా బరిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది.. ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారీ స్కూల్ చేదించిన ఆస్ట్రేలియా.. ఆఫ్ఘనిస్తాన్ పై కూడా అదే ఊపు కొనసాగించాలని భావిస్తుంది.

    Also Read : పాక్ ఔట్.. అగ్రస్థానంలో భారత్.. ఛాంపియన్స్ ట్రోఫీ తాజా పాయింట్ల పట్టిక ఇదే

    ఆస్ట్రేలియాకు అత్యంత కీలకం

    ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగే మ్యాచ్ ఆస్ట్రేలియా కు అత్యంత కీలకం. ఆఫ్ఘనిస్తాన్ తర్వాత దక్షిణాఫ్రికా తో ఆస్ట్రేలియా లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసుకుంటే దక్షిణాఫ్రికా బలంగా కనిపిస్తోంది. ఇటీవల ట్రై సిరీస్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన దక్షిణాఫ్రికా.. ఆ తర్వాత కాస్త పుంజుకుంది. ట్రై సిరీస్ లో ఓటమి పాలైనప్పటికీ పాకిస్తాన్ మైదానాలపై మంచి పట్టు సాధించింది. అందువల్లే ఆఫ్గనిస్తాన్ పై విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ పై విజయం సాధించిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా పై భారీ అంచనాలు ఉన్నాయి. అదే ఊపు కనక ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ కొనసాగిస్తే.. ఇంగ్లాండ్ పై విజయం సాధిస్తే.. గ్రూప్ – బీ లో అగ్రస్థానంలో ఉంటుంది.