Chhaava Movie : ఇటీవలే విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘చావా'(Chhaava Movie) దేశవ్యాప్తంగా సృష్టిస్తున్న ప్రభంజనం ఎలాంటిదో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. పది రోజుల్లో దాదాపుగా 340 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఫుల్ రన్ లో కచ్చితంగా 600 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఈ సినిమాకి బుక్ మై షో లో నేడు కూడా గంటకు 22 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ వారం మొత్తం కూడా జోరు ఇలాగే కొనసాగేలా అనిపిస్తుంది. ముఖ్యంగా శివరాత్రి రోజు మరోసారి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద శివ తాండవం ఆడే అవకాశాలు ఉన్నాయి. కేవలం హిందీ వెర్షన్ తో ఈ రేంజ్ వసూళ్లు అనేది సాధారణమైన విషయం కాదు. గడిచిన కొంన్నేళ్ల నుండి కేవలం పుష్ప 2 తప్ప మరో సినిమాకి ఈ రేంజ్ ట్రెండ్ లేదు.
రీసెంట్ గా విడుదలైన కొంతమంది స్టార్ హీరోల సినిమాలకు అయితే మొదటి రోజు కూడా ఈ రేంజ్ ట్రెండ్ లేకపోవడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో నటించినందుకు హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) కి ఎంత మంచి పేరొచ్చిందో, హీరోయిన్ రష్మిక(Rashmika Mandana) కి కూడా అంతే మంచి పేరొచ్చింది. ఆమె నటనకు ప్రశంసల వర్షం కురిసింది. వరుసగా బాలీవుడ్ లో ఆమె ‘యానిమల్’, ‘పుష్ప 2 ‘, ‘చావా’ వంటి సూపర్ హిట్స్ ని అందుకొని అక్కడ నెంబర్ 1 హీరోయిన్ రేస్ లో నిల్చింది. తెలుగు లో పాపులర్ అయిన ఒక హీరోయిన్, హిందీ లోకి వెళ్లి ఈ రేంజ్ సక్సెస్ ని చూడడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా పూజా హెగ్డే ని సంప్రదించారట. కానీ పూజా హెగ్డే అప్పుడు వేరే సినిమాతో బిజీ గా ఉండడం వల్ల ఈ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది.
బాలీవుడ్ లో పూజ హెగ్డే(Pooja Hegde) కి వరుసగా స్టార్ హీరోలతోనే నటించే ఛాన్స్ దక్కింది. హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్(Salman Khan), అక్షయ్ కుమార్(Akshay Kumar), రణవీర్ సింగ్(Ranveer Singh), షాహిద్ కపూర్(Shahid Kapoor) ఇలాంటి క్రేజీ హీరోలతో కలిసి ఈమె సినిమాలు చేసింది. కానీ ఏమి ప్రయోజనం, ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా సూపర్ హిట్ కాలేదు. అన్ని డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. అయినప్పటికీ చూసేందుకు హాట్ గా కనిపిస్తుంది కాబట్టి, సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఇప్పటికీ ఆమెకు బాలీవుడ్ లో అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే చేతికి వచ్చిన సినిమాలు చేస్తూ పోకుండా, ‘చావా’ సబ్జెక్టు ని ఒప్పుకొని చేసుంటే, ఈరోజు ఆమె పేరు దేశవ్యాప్తంగా మారు మోగిపోయేది కదా. ఇప్పటి వరకు ఆమె అందాలు ఆరబోయడమే కానీ, యాక్టింగ్ చేసింది లేదు. ఈ సినిమా చేసుంటే నటిగా కూడా ఆమె తనని తాను నిరూపించుకునే అవకాశం దక్కేది.