https://oktelugu.com/

ఓట‌మికి ‘చెక్’ చెప్ప‌లేక‌పోయిన నితిన్‌.. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ యాక్సిడెంట్‌.. నష్టం ఎంతంటే?

వి‘జయం’ టాలీవుడ్లో గ్రాండ్ గా లాంఛ్ అయ్యాడు నితిన్. మళ్లీ ఆ స్థాయి హిట్ అందుకోవ‌డానికి చాలాకాలం ప‌ట్టింది. ప‌లు ఫెయిల్యూర్స్ త‌ర్వాత‌ ‘ఇష్క్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ‘అ.. ఆ’ మూవీతో మరో రేంజ్ కు వెళ్లాడీ హీరో. అప్ప‌ట్నుంచి వ‌రుస సినిమాల‌ను లైన్లో పెట్టాడు. ఇందులో లేటెస్ట్ గా రిలీజ్ అయిన చిత్రం ‘చెక్’. Also Read: కలల ప్రేమ మైకంలో ప్రభాస్-పూజా.. రాధేశ్యామ్ […]

Written By:
  • Rocky
  • , Updated On : March 11, 2021 / 03:29 PM IST
    Follow us on


    వి‘జయం’ టాలీవుడ్లో గ్రాండ్ గా లాంఛ్ అయ్యాడు నితిన్. మళ్లీ ఆ స్థాయి హిట్ అందుకోవ‌డానికి చాలాకాలం ప‌ట్టింది. ప‌లు ఫెయిల్యూర్స్ త‌ర్వాత‌ ‘ఇష్క్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ‘అ.. ఆ’ మూవీతో మరో రేంజ్ కు వెళ్లాడీ హీరో. అప్ప‌ట్నుంచి వ‌రుస సినిమాల‌ను లైన్లో పెట్టాడు. ఇందులో లేటెస్ట్ గా రిలీజ్ అయిన చిత్రం ‘చెక్’.

    Also Read: కలల ప్రేమ మైకంలో ప్రభాస్-పూజా.. రాధేశ్యామ్ పోస్టర్ రిలీజ్..

    చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో, భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణి మాలిక్ సంగీతం అందించారు. అయితే.. ఆరంభం నుంచి కమర్షియల్ సినిమాలు చేస్తూ వస్తున్న నితిన్.. ఇందులో మొదటిసారి నటనకు అవకాశం ఉన్న భిన్నమైన పాత్రలో కనిపించాడు.

    నితిన్ లాస్ట్ మూవీ ‘భీష్మ’తో భారీ హిట్‌ను అందుకోవడంతో ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు మూవీ టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో చెక్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 16.10 కోట్లు వరకూ జరిగింది. అయితే.. ఫిబ్ర‌వ‌రి 26న ఈ సినిమా రిలీజ్ అయిన ఈ సినిమా.. మొదటి ఆట నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. దీనికి తోడు వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఉప్పెన’, అల్లరి నరేష్ ‘నాంది’ హవా కొనసాగడంతో ఈ సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడుతూ వచ్చింది.

    Also Read: సినిమా రివ్యూః జాతి ర‌త్నాలు

    మూడు రోజులూ ఎలాగోలా నెట్టుకొచ్చినా.. నాలుగో రోజు కలెక్షన్లు సగానికి పడిపోయాయి. ఫైన‌ల్ గా 13 రోజుల్లోనే సినిమా క్లోజ్ అయిపోయింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.9.35 కోట్ల షేర్ ను మాత్ర‌మే రాబ్ట‌టింది. 16.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన చెక్ మూవీ.. బాక్సాఫీస్ వ‌ద్ద తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది.

    క్లోజింగ్ క‌లెక్ష‌న్స్ ప్ర‌కారం.. ఈ సినిమా దాదాపు 7.15 కోట్ల మేర న‌ష్ట‌పోయింది. నిజానికి నితిన్ సినిమా ఈ స్థాయిలో ఫ్లాప్ అవుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం నితిన్ ఫామ్ ను చూస్తే.. ఈ సినిమా మంచి వ‌సూళ్ల‌నే రాబ‌డుతుంద‌ని అనుకున్నారు ట్రేడ్ అనలిస్టులు. కానీ.. ఈ నంబ‌ర్స్ చూసి షాక్ అవుతున్నారు. కెరీర్ లో దాదాపు అన్నీ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలే చేసిన నితిన్‌.. మొద‌టిసారి ప్ర‌యోగాత్మ‌క చిత్రం ఎంచుకున్నాడు. కానీ.. ఫ‌లితం ఇలా వ‌చ్చింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్