https://oktelugu.com/

పీకి ప‌డుకోపెడితే నీకు కూడా సిస్ట‌రే !

యంగ్ హీరో కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకెక్కుతున్న “చావు కబురు చల్లగా” సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి కూడా అనూహ్య స్పంద‌న ల‌భించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గ్లింప్స్ విడుద‌లై.. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. Also […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 11, 2021 / 12:55 PM IST
    Follow us on


    యంగ్ హీరో కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకెక్కుతున్న “చావు కబురు చల్లగా” సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి కూడా అనూహ్య స్పంద‌న ల‌భించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ గ్లింప్స్ విడుద‌లై.. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

    Also Read: ‘అల్లుడు’ ముందు రావడం పై గోల !

    ముఖ్యంగా ఈ వీడియోలో హీరో కార్తికేయ చెప్పిన “మ‌నం ప్రేమించిన అమ్మాయి మ‌న‌కు త‌ప్ప మిగిలినోళ్ల అంద‌రికీ సిస్ట‌ర్ అనే ఫీలింగ్ ఏదైతే ఉందో అది సూప‌ర్ ఎహే” డైలాగ్ అలానే ప‌లికించిన హావ‌భావ‌లు, హీరోయిన్ లావ‌ణ్య గ్లింప్స్ చివ‌ర్లో “నాలుగు పీకి నిన్ను ఇక్క‌డ ప‌డుకోపెడితే నీకు కూడా నేను సిస్ట‌రే అవుతాను” అంటూ చెప్పిన పంచ్ బాగానే ఉన్నాయి. ఇక లావణ్య లుక్ అండ్ గెటప్ కూడా చాల బాగుంది.

    Also Read: అప్పటి ముచ్చట్లు : ఆ హీరోకి అన్యాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి !

    ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగళ్ల‌పాటి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే రీతిన ఈ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నార‌నే విష‌యం ఇటీవ‌లే విడుద‌లైన బ‌స్తీబాల‌రాజు క్యారెక్ట‌ర్ వీడియో ద్వారా అర్ధమైంది. ఇప్పుడు తాజాగా వ‌చ్చిన టీజ‌ర్ గ్లింప్స్ ద్వారా కూడా అది స్ప‌ష్టం అవుతుంది. జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో “100% ల‌వ్”, “భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌”, ” గీతగోవిందం”, “ప్ర‌తిరోజు పండ‌గే” చిత్రాలు ఘ‌న‌ విజాయాలు సాధించాయి. ఆ లెగ‌సినీ స‌క్సెస్ ఫుల్ గా చావుక‌బురుచ‌ల్ల‌గా ముందుకు తీసుకువెళ్తుందేమో చూడాలి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్