https://oktelugu.com/

ప్రేమికుల ఎదురుచూపులకు మోక్షం.. రానున్న ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ !

నూతన దర్శకుడు మున్నా దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయి.. మొత్తానికి సైడ్ ట్రాక్ కి వెళ్ళిపోయింది. అయితే, ముఖ్యంగా ఈ చిత్రంలోని పాట ‘నీలి నీలి ఆకాశం’ సెన్సేషనల్ హిట్టయి ఏకంగా వందల మిలియన్ల వ్యూస్ ను సాధించి మొత్తానికి రికార్డ్ ను క్రియేట్ చేసింది. దాంతో ప్రేమికులు ఈ సినిమా కోసం ఆసక్తిగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 11, 2021 / 01:07 PM IST
    Follow us on


    నూతన దర్శకుడు మున్నా దర్శకత్వంలో యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా మధ్యలోనే ఆగిపోయి.. మొత్తానికి సైడ్ ట్రాక్ కి వెళ్ళిపోయింది. అయితే, ముఖ్యంగా ఈ చిత్రంలోని పాట ‘నీలి నీలి ఆకాశం’ సెన్సేషనల్ హిట్టయి ఏకంగా వందల మిలియన్ల వ్యూస్ ను సాధించి మొత్తానికి రికార్డ్ ను క్రియేట్ చేసింది. దాంతో ప్రేమికులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు ఎండింగ్ కార్డు పడనుంది.

    Also Read: పీకి ప‌డుకోపెడితే నీకు కూడా సిస్ట‌రే !

    తాజాగా ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌తో సినిమా విడుద‌ల తేదీని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ’30 రోజుల్లో ప్రేమించ‌టం ఎలా’ జ‌న‌వ‌రి 29న విడుద‌ల‌వుతోంది. ‘నీలి నీలి ఆకాశం’ పాట ఎలాగైతే ఆక‌ట్టుకుందో, సినిమా కూడా ప్రేక్ష‌కుల్ని అలాగే అల‌రిస్తుంద‌ని నిర్మాత‌లు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. క‌న్న‌డంలో ప‌లు స‌క్సెస్‌ఫుల్ ఫిలిమ్స్ తీసిన ఎస్‌.వి. బాబు ఈ చిత్రాన్ని ఎస్‌.వి. ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా, కార్తీక్ శ్రీ‌నివాస్ ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు

    Also Read: ‘అల్లుడు’ ముందు రావడం పై గోల !

    అయితే, ఈ సినిమా పై అంచనాలు పెరగడానికి మరో కారణం దర్శకుడు కూడా. సుకుమార్ ద‌గ్గ‌ర ‘ఆర్య 2’, ‘1.. నేనొక్క‌డినే’ చిత్రాల‌కు ప‌నిచేసిన మున్నా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించడం.. సినిమా కూడా బాగా తీసాడు అని పేరు రావాడంతో సినిమాకి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ప్ర‌దీప్ స‌ర‌స‌న నాయిక‌గా అమృతా అయ్య‌ర్ న‌టించారు. అనూప్ రూబెన్స్ సంగీతం స‌మ‌కూర్చిన ఈ చిత్రానికి సంబంధించి నిర్మాత‌లు ఇప్ప‌టివ‌ర‌కూ మూడు పాట‌ల‌ను విడుద‌ల చేశారు. మూడింటికీ ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. ప్ర‌త్యేకించి ‘నీలి నీలి ఆకాశం’ పాటకు ఇప్ప‌టివ‌ర‌కూ 218 మిలియ‌న్ వ్యూస్ సాధించ‌డం పెద్ద విశేషం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్