సీఎం కేసీఆర్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న అఖిలప్రియకు గట్టి షాక్ తగిలింది. ఆమె బెయిల్ కోసం సికింద్రాబాద్ కోర్టులో పెట్టుకున్న పిటీషన్ కు చుక్కెదురైంది.
అఖిలప్రియ పెట్టుకున్న బెయిల్ పిటీషన్ ను తాజాగా సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. అఖిలప్రియ మెడికల్ రిపోర్టును చంచల్ గూడ జైలు అధికారులు కోర్టుకు తాజాగా సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
అఖిలప్రియకు బెయిల్ ఇవ్వవద్దంటూ పోలీసులు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయని కోర్టుకు విన్నించారు. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ కోసం అఖిలప్రియను కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు. అఖిలప్రియను ఏడురోజులు కస్టడీకి ఇవ్వాలని బోయినపల్లి పోలీసులు కోర్టులో పిటీషన్ వేశారు.
కేసులో ఇంకా దర్యప్తు చేయాల్సి ఉందంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక ప్రవీణ్ రావు సోదరులతో సంతకాలు చేయించిన పత్రాలు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని.. సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం పరిశీలించాల్సి ఉంటుందని పోలీసులు కోర్టులో అఫిడవిట్ లో కోరారు. భార్గవ్ రామ్ కూడా పరారీలోనే ఉన్నందున బెయిల్ ఇవ్వద్దని పోలీసులు కోరారు. కోర్టు పోలీసుల వాదనతో ఏకీభవించింది. అఖిలప్రియను మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగించారు.నేటి నుంచి 13వరకు అఖిలప్రియను పోలీసులు విచారించనున్నారు.