https://oktelugu.com/

AP CM: సారూ.. చాలా బిజీ.. ఐపీఎస్ లతో కూడా మాట్లాడలేదట?

AP CM: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బిజీబిజీగా గడుపుతున్నారు. జగన్ సీఎం అయ్యాక సొంత పార్టీల నేతలకే ఆయన అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా మారింది. కొందరు మంత్రులు, సలహాదారులతో మినహా ఏ ఒక్కరితో ఆయన నేరుగా మాట్లాడిన దాఖలాలు లేవనే ప్రచారం ఇటీవలీ కాలంలో జోరుగా సాగుతోంది. తాజాగా జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శంగా కన్పిస్తోంది. గురువారం రోజున తాడేపల్లిలోని సీఎం నివాసానికి రెండు బస్సుల్లో ఐపీఎస్ అధికారులు వెళ్లారు. అయితే వీరికి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 17, 2021 5:25 pm
    Follow us on

    AP CM: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక బిజీబిజీగా గడుపుతున్నారు. జగన్ సీఎం అయ్యాక సొంత పార్టీల నేతలకే ఆయన అపాయింట్మెంట్ దొరకడం కష్టంగా మారింది. కొందరు మంత్రులు, సలహాదారులతో మినహా ఏ ఒక్కరితో ఆయన నేరుగా మాట్లాడిన దాఖలాలు లేవనే ప్రచారం ఇటీవలీ కాలంలో జోరుగా సాగుతోంది. తాజాగా జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శంగా కన్పిస్తోంది. గురువారం రోజున తాడేపల్లిలోని సీఎం నివాసానికి రెండు బస్సుల్లో ఐపీఎస్ అధికారులు వెళ్లారు. అయితే వీరికి కూడా నిరాశే ఎదురుకావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

    AP CM

    AP CM

    AP CM Jaganఐపీఎస్ ఆఫీసర్లంతా మూకుమ్ముడిగా వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి వారితో మాట్లాడలేనంత బీజీగా ఉన్నారా? లేదా వారిని కావాలనే సీఎం వెయిట్ చేయిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిన్న వీరికి కనీసం సీఎం క్యాంపు కార్యాలయంలోకి అనుమతి కూడా లభించలేదనే ప్రచారం జరుగుతోంది. సీఎం ఫుల్ బీజీగా ఉన్నారని శుక్రవారం రావాలని ఐపీఎస్ అధికారులకు పంపించినట్లు తెలుస్తోంది. అయితే మూకుమ్మడిగా ఐపీఎస్ అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డి కలువాల్సిన పని ఏంటా? అనేది మాత్రం అంతుచిక్కడం లేదు.

    సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసానికి రావడానికి ముందే ఐపీఎస్ అధికారులు విజయవాడలో సమావేశం అయ్యారు. వీరంతా కలిసి రీట్రీట్ చేసుకున్నారా? అంటే కాదనే మాటలే విన్పిస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి పార్టీలు వీకెండ్లో మాత్రమే చేసుకునే అవకాశం అధికారులకు ఉంటుంది. కానీ వారంతా మూకుమ్మడిగా గురువారం కలిశారు. దీంతో ఏదో ముఖ్యమైన పని మీదే వీరంతా చర్చించుకొని ఉంటారని టాక్ విన్పిస్తోంది.

    Also Read: పవన్ కు లెక్కుంది.. అదే రేపు ఏపీలో కిక్కుస్తుందట..!

    ఆ తర్వాతే అధికారులంతా విజయవాడ నుంచి నేరుగా రెండు బస్సుల్లో బయలుదేరి తాడేపల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. అపాయిమ్మెంట్ లేకుండా అంతా మంది ఐపీఎస్ లు సీఎంను కలువడానికి వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే వారికి అక్కడ నిరాశే ఎదురైంది. సీఎం జగన్ తో మాట్లాడకుండానే వారంతా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ రోజు ఐపీఎస్ లు సీఎంతో భేటి అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో సీఎంతో ఐపీఎల్ ఎలాంటి సమస్యలు చర్చిస్తారా? అన్న ఆసక్తి నెలకొంది.

    మరోవైపు పలువురు ఐపీఎస్ లు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను విపక్షాల నుంచి ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం మారితే వీరికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలోనే వీరంతా మూకుమ్మడిగా సమావేశమై తమ భవిష్యత్ కార్యచరణను సీఎం జగన్మోహన్ రెడ్డి వివరించనున్నారా? అనే ప్రచారం జరుగుతోంది. ఏదిఏమైనా ఈరోజు ఐపీఎస్ లు సీఎంతో భేటి అయ్యాకే అసలు విషయాలు బయటికి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

    Also Read: జగ‘న్నాటకా’నికి సినీ ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరి