Chaavaa Movie Collection : హిందీ లో ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనక వర్షం కురిపించిన ‘చావా'(Chaavaa Movie) చిత్రం, నేడు తెలుగు వెర్షన్ లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనాన్ని చూసి, మన ఆడియన్స్ తెలుగు వెర్షన్ లో విడుదల చేయాలని ఎంతగానో డిమాండ్ చేసారు. ఆ డిమాండ్ ని గమనించిన అల్లు అరవింద్, గీత ఆర్ట్స్ బ్యానర్ పేరు మీద తెలుగు డబ్బింగ్ రైట్స్ కొనుగోలు చేసి నేడు విడుదల చేసారు. హిందీ లో విడుదలైన మూడు వారాల తర్వాత తెలుగులో విడుదలైంది. ఈ సినిమాని ఎవరు పట్టించుకుంటారులే అని అందరూ అనుకున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్ ని చూసి ట్రేడ్ పండితులకు మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. బుక్ మై షో యాప్ లో ఈ సినిమాకి గంటకు నాలుగు వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
Also Read : అక్షరాలా 1 కోటి టిక్కెట్లు..చరిత్ర సృష్టించిన ‘చావా’..ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ ఎంతంటే!
ఇది సాధారణమైన విషయం కాదు. ఆన్లైన్ లో ట్రాక్ చేసిన లెక్కల ప్రకారం చూస్తే ఈ సినిమాకి మొదటి రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు 74 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. నాలుగు గంటల తర్వాత ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ కి కిక్కిరిసిపోయే రేంజ్ లో జనాలు థియేటర్స్ లో సందడి చేసారు. ఓవరాల్ గా ఆన్లైన్ లో ట్రాక్ చేసిన లెక్కల ప్రకారం ఈ సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి 80 లక్షల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది కేవలం ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా తీసుకున్న గ్రాస్ మాత్రమే, ఆన్లైన్ లో కాకుండా కౌంటర్ బుకింగ్స్ ఉండే థియేటర్స్ వందల సంఖ్యలో ఉంటుంది. అవన్నీ కలిపి చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల నుండి నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
షేర్ దాదాపుగా రెండు కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. రేపు, ఎల్లుండి వీకెండ్ కాబట్టి, ఈరోజు వచ్చిన వసూళ్లకు రెండు రెట్ల ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా మొదటి వీకెండ్ తెలుగు వెర్షన్ 6 నుండి 8 కోట్ల రూపాయిల షేర్, 18 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అదే కనుక జరిగితే అల్లు అరవింద్ జాక్పాట్ కొట్టినట్టే అనుకోవచ్చు. ఫుల్ రన్ లో ఇదే తరహా దూకుడు ని చూపిస్తే, కచ్చితంగా 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి రావడం మొదలు పెడితే వంద కోట్ల గ్రాస్ వసూళ్లను తెలుగు వెర్షన్ నుండి రాబట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : చావా’ ని డామినేట్ చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ రీ రిలీజ్..అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఎంతంటే!